Begin typing your search above and press return to search.

‘నేను లోకల్’ ట్రైలర్లో అతను లేడేంటి?

By:  Tupaki Desk   |   15 Jan 2017 11:28 AM GMT
‘నేను లోకల్’ ట్రైలర్లో అతను లేడేంటి?
X
‘నేను లోకల్’ ట్రైలర్ చూడగానే.. నాని ఇంకో హిట్టు కొట్టేయబోతున్న ఫీలింగ్ కలిగింది జనాలకు. ‘సినిమా చూపిస్త మావ’ లాంటి లో బడ్జెట్ మూవీలో మెరుపులు మెరిపించిన త్రినాథరావు.. పెద్ద బేనర్.. పేరున్న హీరో దొరికేసరికి మరింత కసిగా.. కాన్ఫిడెంట్‌ గా సినిమా తీసినట్లున్నాడు. ట్రైలర్ ఆద్యంతం అలరిస్తూ సాగింది. మాంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. ట్రైలర్ చూస్తే ఇది ప్రధానంగా నాని క్యారెక్టరైజేషన్ చుట్టూ తిరిగే సినిమాలాగా కనిపించింది. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా బాగానే హైలైట్ అయింది. హిందీ నటుడు సచిన్ ఖేద్కర్ ఓ సరదా పాత్రలో కనిపించినట్లున్నాడు.

వీళ్లందరూ ఓకే కానీ.. ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న నవీన్ చంద్రకు మాత్రం ట్రైలర్లో చోటు దక్కలేదు. ఇన్నాళ్లూ హీరోగానే కనిపించిన నవీన్.. తొలిసారి నెగెటివ్ రోల్ చేసిన సినిమా ఇది. దీంతో అందరూ అతడి పాత్ర ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆడియో వేడుకలో గడ్డం తీసేసి కొత్త లుక్ లో కనిపించి షాకిచ్చాడు నవీన్. ఈ సినిమా కోసమే అతను లుక్ మార్చుకున్నట్లు చెప్పడంతో అతడి పాత్రపై ఆసక్తి మరింత పెరిగింది. ఐతే నవీన్ పాత్రను విడుదల వరకు దాచి ఉంచి.. ఒకేసారి సర్ప్రైజ్ చేయాలని భావిస్తున్నారో ఏంటో కానీ.. ట్రైలర్లో అతణ్ని ఎక్కడా చూపించలేదు. మరి నవీన్ పాత్రలో ఏం ప్రత్యేకత ఉందో తెలియాలంటే ఫిబ్రవరి మూడో వారం వరకు ఆగాల్సిందే.