Begin typing your search above and press return to search.
బ్యాక్ గ్రౌండ్ లేకున్నా నిలదొక్కుకున్నాడు!
By: Tupaki Desk | 1 Jun 2019 6:23 AM GMTఎలాంటి సినీనేపథ్యం లేకుండా టాలీవుడ్ లో రాణించిన కథానాయకుల జాబితా తిరగేస్తే అందులో ఎనర్జిటిక్ హీరో నిఖిల్ పేరు ఉంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ చిత్రంతో నలుగురిలో ఒకడిగా ఆరంగేట్రం చేసిన నిఖిల్ ఆ తర్వాత సోలో హీరోగా ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిమంతం. హీరోగా ఛాన్స్ వచ్చాక అతడు ఒక క్రమబద్ధమైన ప్రణాళిక- హార్డ్ వర్క్ తో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎదిగేందుకు ప్రయత్నించాడు. ఇప్పటివరకూ ఇమేజ్ సమస్య అన్నదే లేకుండా చక్కని కథల్ని ఎంచుకుని రాణించాడు. సాటి హీరోలు కెరీర్ పరంగా డౌన్ ఫాల్ అవుతుంటే నిఖిల్ మాత్రం అంతకంతకు ఒక్కో మెట్టు ఎక్కేందుకు బాటలు వేసుకుని సాటి హీరోలకే ఆదర్శం అయ్యాడు. ఒకానొక దశలో నిఖిల్ ఒక ట్రెండ్ సెట్టర్ అన్న పేరొచ్చింది. స్వామిరారా- కార్తికేయ - సూర్య వర్సెస్ సూర్య అంటూ వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టాడు.
ఇప్పటికీ అదే పంథాలో కొత్తదనం నిండిన కథల్ని ఎంచుకుని కెరియర్ ని నడిపిస్తున్నాడు. ఒడిదుడుకులు ఉన్నా మధ్యలో హిట్లు కొడుతూ బండిని తిరిగి ట్రాక్ లోకి తేవడం ఎలానో నిఖిల్ ని చూస్తే ఇతరులకు అర్థమవుతుంది. ఓవైపు ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నా `ఎక్కడికి పోతావు చిన్నవాడా?`, `కేశవ` చిత్రాలతో తిరిగి కంబ్యాక్ అయ్యాడు. మళ్లీ ఓ ఫ్లాప్ వచ్చినా అతడి కెరియర్ పై అదేమీ ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం `అర్జున్ సురవరం` చిత్రంతో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించాడు. సినిమా కథాంశం కొత్తదనంతో ఎనర్జిటిక్ గా ఉంటుందని ఇదివరకూ రిలీజైన టీజర్- ట్రైలర్ చెప్పాయి.
టాలీవుడ్ లో సినీనేపథ్యం లేకుండా ఎందరో హీరోలొచ్చారు. అయితే కొంతకాలం తర్వాత కనిపించడం లేదు. అయితే స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో నిలదొక్కుకున్న వారి జాబితాలో రవితేజ.. నాని .. తర్వాత నిఖిల్ కి అంత బిగ్ కెరియర్ కనిపిస్తోంది. వీళ్ల తర్వాత దేవరకొండ స్వయంకృషితో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. పోటీ ఎంత ఉన్నా నిఖిల్ తన గ్రాఫ్ ని నిలబెట్టుకునేందుకు మునుముందు ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడు? ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తాడు? అన్నది వేచి చూడాల్సిందే. నేడు యంగ్ డైనమిక్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ బర్త్ డే సందర్భంగా తుపాకి తరపున శుభాకాంక్షలు.