Begin typing your search above and press return to search.
వివాదం పక్కనబెట్టి టాక్సీవాలాకు సపోర్ట్
By: Tupaki Desk | 15 Nov 2018 7:49 AM GMTవిజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' నవంబర్ 17 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ కట్ వెర్షన్ విడుదలకు ముందే పైరసీ జరగడంతో ఫిలిం మేకర్స్ తో పాటుగా 'టాక్సీవాలా' టీమ్ తమ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని పైరసీని ప్రోత్సహించావద్దని కోరుతున్నారు. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సుజిత్ సారంగ్ ఈమధ్య సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తామందరం సినిమాకోసం ఎంతో కష్టపడతామని.. ఒక్కోసారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సినిమాకు పని చేస్తామని.. అందుకే పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లోనే సినిమా చూసి ఎంజాయ్ చెయ్యాలని కోరాడు.
ఈ పోస్ట్ చాలా వైరల్ అయింది. ఈ పోస్ట్ కు స్పందించిన హీరో నిఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా ట్వీట్ చేశాడు. "నేను అమెరికాలో ఉన్నాను. సుజిత్ సారంగ్ పోస్ట్ చూసి ఈ వీడియో పెడుతున్నాను. ఈ సినిమాకు పనిచేసిన SKN.. రాహుల్ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను మీ అందరినీ పైరసీని ప్రోత్సహించవద్దని మనసారా కోరుతున్నాను." దీంతో పాటు ఒక ఒక వీడియో మెసేజ్ కూడా ఇచ్చాడు. అందులో సినిమాకోసం చాలా కష్టపడతారని.. అలాంటిది 'టాక్సీవాలా' ను పైరసీ చెయ్యడం బాధాకరమని చెప్పాడు. 'టాక్సీవాలా' సినిమాను థియేటర్లోనే చూడమని అందరినీ కోరాడు. హీరో విజయ్ తో పాటు ఈ సినిమాకు పనిచేసిన వారికి అల్ ది బెస్ట్ చెప్పాడు. దీనికి రెస్పాన్స్ గా విజయ్ కూడా 'థాంక్ యు' చెప్పాడు.
ఇంట్రెస్టింగ్ విషయం ఎంటంటే.. విజయ్ దేవరకొండ గత చిత్రం 'నోటా' ఫ్లాప్ అయిన తర్వాత విజయ్ ట్విట్టర్ లో ఫ్యాన్స్ కు ఒక మెసేజ్ పెట్టాడు. అందులో తన ఫెయిల్యూర్ కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే పండగ చేసుకోండని.. తర్వాత మళ్ళీ అవకాశం దొరకదని అన్నాడు. దానికి నిఖిల్ ఇం డైరెక్ట్ గా విజయ్ పై సెటైర్లు వేయడం.. ఆ తర్వాత నెటిజనులు ట్రోల్ చేయడం జరిగింది. దాంతో ఆ ట్వీట్లు డిలీట్ చేసి.. తన ట్వీట్లు ఎవరిన్నీ ఉద్దేశించినవి కావని వివరణ ఇచ్చాడు. విజయ్ మాత్రం వీటిపై రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు 'టాక్సీవాలా' కు మద్దతు ప్రకటించడం చూస్తుంటే దేవరకొండ తో కోల్డ్ వార్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్టేనని కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.