Begin typing your search above and press return to search.

రెమ్యూనరేషన్‌ డబుల్‌ చేసిన సూపర్‌ హిట్‌ సినిమా హీరో

By:  Tupaki Desk   |   15 Dec 2022 2:30 AM GMT
రెమ్యూనరేషన్‌ డబుల్‌ చేసిన సూపర్‌ హిట్‌ సినిమా హీరో
X
యంగ్‌ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు దక్కించుకున్న విషయం తెల్సిందే. కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ సక్సెస్ ను దక్కించుకున్న నిఖిల్‌ కెరీర్‌ స్పీడ్‌ అందుకుంది. కార్తికేయ 2 సినిమా సూపర్‌ హిట్‌ నేపథ్యంలో ఆయన నటించిన మరో సినిమా 18 పేజెస్ కి మంచి మార్కెట్‌ క్రియేట్‌ అయ్యింది.

18 పేజెస్ సినిమా భారీ గా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో ముందు ముందు నిఖిల్‌ అన్ని సినిమాలు కూడా కచ్చితంగా భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిఖిల్‌ తన పారితోషికంను పెంచాశాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కార్తికేయ 2 కు ముందు వరకు నాలుగు నుండి అయిదు కోట్ల పారితోషికం ను నిఖిల్ అందుకునేవాడట. కానీ ఇప్పుడు ఆయన పారితోషికం దాదాపుగా రెట్టింపు అయ్యిందట. నిఖిల్ కొత్త సినిమాను కమిట్‌ అవ్వాలి అంటే ఏకంగా రూ.8 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి మరీ నిఖిల్ తో సినిమాను చేసేందుకు ఒప్పందం కుదుర్చుందట. అందులో భాగంగా భారీ మొత్తంలో అడ్వాన్స్ ను కూడా ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి.

నిఖిల్ ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరో.. మంచి కథతో సినిమా తీయాలే కానీ పాన్‌ ఇండియా రేంజ్ లో మంచి వసూళ్లు రాబట్టగల సత్తా ఉన్న హీరో. అందుకే ఆయన పారితోషికం 8 కోట్లకు పెంచడం తప్పేం లేదు అన్నట్లుగా కొందరు నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.