Begin typing your search above and press return to search.
ఆ రేటు వర్కౌట్ కాదని నితిన్ వదిలేశాడట
By: Tupaki Desk | 4 Jan 2019 7:08 AM GMTతెలుగు సినిమాలు తమిళంలో, తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ అవ్వడం సర్వసాదారణం. ఏదైనా సినిమా సక్సెస్ కాగానే రీమేక్ కు సంబంధించిన చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈమద్య కాలంలో భాషతో సంబంధం లేకుండా ఆన్ లైన్ లో సబ్ టైటిల్స్ తో సినిమాలు చూసేస్తున్నారు. దాంతో రీమేక్ చేయడం వల్ల ప్రేక్షకుల నుండి అంతగా ఆధరణ దక్కడం లేదు అనేది కొందరి మాట. తాజాగా అదే పరిస్థితి తమిళ మూవీ రాక్షసన్ కు ఎదురైంది. మొదట రాక్షసన్ తెలుగు రీమేక్ రైట్స్ కు భారీగా పోటీ పడ్డారు. నితిన్ అందరికంటే ముందే రేటు ఫిక్స్ కాకుండానే అడ్వాన్స్ ఇచ్చేశాడట.
రాక్షసన్ మూవీ బాగా నచ్చడంతో నితిన్ ఎలాగైనా ఆ మూవీని రీమేక్ చేయాలని భావించాడు. అందుకే కాస్త ఎక్కువ అయినా పర్వాలేదు రీమేక్ చేసేయాలనుకున్నాడు. అందుకోసం దర్శకుడిని కూడా వెదికి కొందరిని ఎంపిక చేసుకున్నాడు. అలాంటి సమయంలో రాక్షసన్ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ ను తమిళ నిర్మాతలు ఏకంగా నాలుగు కోట్లు అయితేనే ఇస్తాం అంటూ చెప్పడంతో నితిన్ ఆలోచనల్లో పడ్డాడట. ఇప్పటికే రాక్షసన్ మూవీకి వచ్చిన టాక్ నేపథ్యంలో తెలుగు ఆడియన్స్ ఎంతో మంది ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అమెజాన్ లేదా ఇతర ఆన్ లైన్ పోర్టల్ లలో చూసేశారు. ఇప్పుడు రీమేక్ చేస్తే ఆ ప్రేక్షకులు మళ్లీ సినిమాకు రావడం అనుమానమే. అందుకే నితిన్ ఆ ప్రాజెక్ట్ ను వదిలేసినట్లుగా తెలుస్తోంది.
నితిన్ డ్రాప్ అయిన విషయం తెలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయాల్సిందిగా తనకు తెలిసిన నిర్మాతలకు చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. రాక్షసన్ మూవీపై బెల్లంకొండ శ్రీనివాస్ ఆసక్తిగా ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు పూర్తయిన తర్వాత బెల్లంకొండ ఆ రీమేక్ లో నటించే అవకాశాలున్నాయి.