Begin typing your search above and press return to search.
మోదీ భేటీకి హీరోల పెళ్లికి ఏంటి లింకు?
By: Tupaki Desk | 2 April 2020 4:01 AM GMTకరోనా వైరస్ దెబ్బకి (కొవిడ్-19) ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా కకావికలమవుతున్న సంగతి తెలిసిందే. దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడం తో ఎక్కడికక్కడ అన్నీ బ్లాక్ అయిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ భయ పెడుతోంది. ఏపీలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి అనుకుంటుండగానే..ఒక్కసారిగా పొరుగు రాష్ట్రం తెలంగాణని మించిపోయి ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదవ్వడంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. అటు తెలంగాణ లోనూ అంతకంతకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
కరోనాకి కొన్ని మినహాయింపుల పేరుతో చేసిన తెలివి తక్కువ పని కూడా భయపడెడుతోంది. అప్పట్లోనే కరోనా స్టార్టింగ్ దశలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెళ్లిళ్లు చేసుకోవాలంటే పెళ్లి కోడుకు తరుపు నుంచి 100 మంది...పెళ్లి కూతురు తరుపు నుంచి 100 మొత్త 200 మందితో పెళ్లి తంతు సింపుల్ గా కానిచ్చేయాలని అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వంద మంది కాదు కదా! మనిషికి మనిషే శత్రువన్న పరిస్థితి తలెత్తింది. దీంతో అన్ని పెళ్లి వేడుకలు రద్దు అవుతున్నాయి. ఇప్పటికే యూత్ స్టార్ నితిన్-శాలిని వివాహం వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సి ఉండగా వైరస్ కారణంగా పెళ్లి వాయిదా వేసుకున్నారు. తాజాగా యంగ్ హీరో నిఖిల్ పెళ్లి కూడా వాయిదా పడింది. నితిన్ ముహూర్తం రోజునే నిఖిల్ తాను ప్రేమించిన డాక్లర్ పల్లవిని పెళ్లి చేసుకోవాల్సి ఉంది. గోవాలో వివాహ వేదికగా నిర్ణయించారు. కరోనా దెబ్బకి ఇల్లు కదలడానికి వీల్లేదు కాబట్టి పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
వాస్తవానికి లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకూ విధించారు. కానీ వైరస్ మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోన్న నేపథ్యంలో లాక్ డౌన్ ఆ నెల చివరి వరకూ పొడిగించే అవకాశం లేకపోలేదు. అప్పటికీ వైరస్ అదుపులోకి రాకపోతే మరో నెల..రెండు నెలల పాటు పొడిగించే అవకాశాలున్నాయి. నేడు ప్రధాని నరేంద్ర మోదీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమత్రులతో వీడియో కాన్పరెన్స్ లో అలెర్ట్ చేసే పనిలో ఉన్నారు. ఆ భేటీని బట్టి లాక్ డౌన్ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి ప్రజలు అప్పుడే రొడ్డేక్కాలా? లేక ఇంకా ఇళ్లకే పరిమితమవ్వాలా? అన్నది తేల్తుంది. ఆ తర్వాతే నితిన్...నిఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యేది.