Begin typing your search above and press return to search.
బన్నీతో నితిన్ పోటీ
By: Tupaki Desk | 8 March 2019 8:19 AM GMTనితిన్ గత చిత్రం శ్రీనివాస కళ్యాణం వచ్చి ఏడు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. ఆ మధ్య హనుమాన్ దీక్ష తీసుకుని తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఇవాళ ట్విట్టర్ లో అప్ డేట్ ఇస్తూ త్వరలో కొత్త సినిమాల వివరాలు చెబుతానని నెలాఖరులో అన్ని తెలుస్తాయని ట్వీట్ చేశాడు. పనిలో పనిగా కళ్యాణ్ రామ్ 118ని మెచ్చేసుకున్నాడు.
ఇదంతా ఓకే కానీ అసలు ఇంత గ్యాప్ నితిన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్నకు నేరుగా సమాధానం దొరకడం లేదు. నాలుగు నెలల క్రితమే ఛలో ఫేమ్ వెంకీ కుడుములతో భీష్మ అనే స్క్రిప్ట్ ఓకే అయ్యిందని రష్మిక మందన్న కాల్ షీట్స్ ఇచ్చిందని నమ్మదగిన సోర్స్ నుంచే న్యూస్ వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. తీరా చూస్తే ఇప్పుడు మంత్ ఎండింగ్ దాకా వెయిట్ చేయమంటున్నాడు
ఒకరకంగా చూస్తే నితిన్ గ్యాప్ విషయంలో అల్లు అర్జున్ తో పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. అచ్చం ఇదే తరహాలో బన్నీ కూడా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నాడే తప్ప కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టనే లేదు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని ఇంకా చెక్కుతూనే ఉన్నాడు కాబోలు. ఫాన్స్ ఫీలవ్వకుండా గీత కాంపౌండ్ సుకుమార్ మురుగదాస్ విక్రమ్ కుమార్ లతో వరస ప్రాజెక్టులు ఉంటాయని ఫీలర్లు ఇస్తోందని ఫిలిం నగర్ టాక్. ఇక్కడ నితిన్ తీరు అక్కడ బన్నీ వరస ఒకే తీరులో ఉంది. ఏదో రెండు మూడు నెలల గ్యాప్ అంటే ఓకే కానీ మరీ ఏడు ఎనిమిది నెలలు అంటే టూ మచ్చే.