Begin typing your search above and press return to search.
కరణ్ జోహార్ తో పెట్టుకున్నాక హీరో ఆఫర్లు నిల్!
By: Tupaki Desk | 9 May 2021 4:30 PM GMTగత కొంతకాలంగా బాలీవుడ్ లో ఫేవరిజం గురించి దేశవ్యాప్తంగా చర్చ సాగుతూనే ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిబేట్లు కొనసాగాయి. బాలీవుడ్ మాఫియా ఔట్ సైడర్స్ ని కానీ.. తమకు నచ్చనివాళ్లను కానీ బతకనివ్వదని ప్రచారం సాగింది.
ఇప్పుడు ప్రముఖ దర్శకనిర్మాత.. బాలీవుడ్ డీన్ కరణ్ జోహర్ తో ఘర్షణ పడిన యువ హీరో కార్తీక్ ఆర్యన్ పరిస్థితి అందుకు భిన్నంగా లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. యువ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ పలు చిత్రాలకు పని చేస్తున్నాడు. అతను కరణ్ బ్యానర్ లో దోస్తానా 2 చిత్రీకరణలోనూ పాల్గొన్నాడు. కానీ అనూహ్యంగా ధర్మ సంస్థ నుంచి ఒక ప్రకటన షాక్ కి గురి చేసింది. కార్తీక్ వృత్తిపరంగా క్రమశిక్షణా రాహిత్యం కారణంగా తమ సంస్థ సినిమాల నుంచి తొలగించామని.. కార్తీక్ తో మళ్లీ పనిచేయబోమని ప్రకటించారు. ఇది చాలా మందికి షాక్ ఇచ్చింది.
ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ సమాచారం మేరకు.. కార్తీక్ కు సినిమా ఆఫర్లు గణనీయంగా తగ్గాయి. సదరు ట్యాలెంటెడ్ స్టార్ హీరోని కరణ్ బహిష్కరించినందున చాలా బ్యానర్లు ఆయనపై ఆసక్తి చూపడం లేదు. ఆ ఘటన తర్వాత సీక్వెన్స్ యువహీరోని చివరికి ఇలా ఇబ్బందుల పాల్జేస్తోంది.
కరణ్ ఇప్పటికే సుశాంత్ సింగ్ వంటి బయటి వ్యక్తుల కెరీర్ ను నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని ఇంతకుముందు కంగన రనౌత్ వంటి నాయిక విమర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తీక్ విషయంలోనూ ఇది రిపీటవుతోంది!! అంటూ ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితిని కార్తీక్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సి ఉంది.