Begin typing your search above and press return to search.
రవితేజకి హీరో సమస్య..అందుకే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్!
By: Tupaki Desk | 28 Jan 2022 1:30 AM GMT`విక్రమ్ వేద` కోలీవుడ్ లో ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. మాధవన్..విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. దీంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని గట్టి ప్రయత్నాలు సాగాయి. మాస్ రవితేజ వేద పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించాడు.
అలాగే యంగ్ మేకర్ సుధీర్ వర్మ అయితే ఈ చిత్రాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలడని ఆ అవకాశం మాస్ రాజా అతనికే ఇచ్చాడు. అయితే విక్రమ్ పాత్రలో నటించడానికి అంతే పవర్ ఫుల్ హీరో అవసరం. దీంతో సుధీర్ వర్మ చాలా మంది టాలీవుడ్ హీరోల చుట్టూ తిరిగాడు.
కానీ వాళ్లంతా వేద పాత్రలో నటించడానికి మెగ్గు చూపారు తప్ప విక్రమ్ పాత్రపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. అలా విక్రమ్ వేద తెలుగు రీమేక్ పక్కదారి పట్టింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా మాతృక నిర్మాత శిశికాంత్ ఎవ్వరూ అప్పగించలేదు. తెలుగులోనూ తానే రీమేక్ చేయాలని భావించి ఎవరికీ కట్టబెట్టలేదు.
అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. హృతిక్ రోషన్...సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన పుష్పకర్-గాయత్రి దంపతులే ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు.
సెప్టెంబర్ లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. హిందీ వెర్షన్ లోనే చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది. గ్యాంగ్ స్టర్ -కాప్ స్టోరీ కి ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మళ్లీ తెలుగులో ఈ రెండు కథల్ని కలిపి ఫ్రెష్ థాట్ ని ఇన్ బిల్డ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. దానికి చాలా కసరత్తులు తప్పవు. అలా రవితేజ తో వచ్చిన ఛాన్స్ ని సుదీర్ వర్మ కోల్పోయాడు. అయితే `రావణాసుర`తో ఆ అవకాశం సుదీర్ మళ్లీ దక్కించుకోవడం విశేషం.