Begin typing your search above and press return to search.
నా పాపాలు తెలిస్తే.. వైఫ్ వెళిపోతుంది
By: Tupaki Desk | 31 March 2018 10:40 AM GMTరాజా... శ్రీకాంత్ ‘ఓ... చిన్నదాన’ సినిమాలో గజలా పక్కన ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు, శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు. ‘వెన్నల’, ‘ఒక ఊరిలో’, ‘స్టైల్’, ‘ఆ నలుగురు’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన... రాజా 2012లో వచ్చిన ‘నువ్వా- నేనా’ సినిమాలో అతిథి పాత్ర తర్వాత కనిపించడం మానేశాడు. హఠాత్తుగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ కనిపించాడు రాజా...
మతం మార్చుకుని... పాస్టర్ గా మారిపోయాడు రాజా. పేరు కూడా రాజా అబెల్ అని మార్చుకున్న ఈయన... ‘సినిమాల్లో నేను చేయని పాపమంటూ లేదు... శారీరకంగా... మానసికంగా అన్ని రకాల పాపాలు చేశాను. అందుకే నన్ను రక్షించమని యేసుని వేడుకుంటున్నాను...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నేను చేసిన పాపాల గురించి తెలిస్తే... నా భార్య నన్ను విడిచి వెళ్లిపోతుందంటూ...’ నానా రచ్చ చేసేశాడు రాజా. సినిమాల్లో ఉన్నప్పుడు తెర మీదా... తెర వెనుకా నటించానని... ఇప్పుడు ఆ అవసరం లేదని... సినిమాలు మానేస్తున్నానని చెప్పుకొచ్చాడు రాజా. ఇంత చెప్పి ఏం తప్పులు చేశాడో మాత్రం చెప్పకుండా వదిలేశాడు రాజా. ఈ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో బాగానే ట్రెండ్ అవుతోంది.
రాజా... విశాఖపట్నంలో పుట్టిన తెలుగు వాడు. మంచి ఫ్లోతో మాట్లాడేవాడు. కానీ మతం మారక మనోడి మాటతీరులో కూడా మార్పు వచ్చింది. క్రైస్తవ బోధకులు మాట్లాడినట్టు... తెలుగు రాని వాళ్లు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఈ వీడియో చూసిన వాళ్లంతా... ఏంది రాజా... ఇది! ఛాన్సులు రాకపోతే మాత్రం... ఇలా అయిపోయావేంది? అని అనుకుంటున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి