Begin typing your search above and press return to search.
ప్రమాదం జరిగినప్పుడు హీరో రాజశేఖర్ కారు వేగం అంతా?
By: Tupaki Desk | 13 Nov 2019 10:26 AM GMTటాలీవుడ్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. రాజశేఖర్ ఇంట కారు ప్రమాదాలు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ప్రయాణిస్తున్న కారు వేరే వారి కారును ఢీ కొనటం.. పోలీస్ స్టేషన్ బయట సెటిల్ చేసుకోవటం తెలిసిందే. ఆ సమయంలో రాజశేఖర్ కారు స్పీడ్ ఎక్కువగా ఉన్నట్లుగా చెబుతారు. ఆ తర్వాత రాజశేఖర్ ఇంటి సభ్యులు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురి కావటం అప్పట్లో చర్చగా మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రమాదానికి గురైన కారును చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. మెర్సిడెజ్ బెంజ్ కు చెందిన హై ఎండ్ కారు కావటంతో ఇంత ప్రమాదం జరిగినా.. ఏమీ కాకుండా బయటపడగలిగారని చెప్పాలి.
ఇంతకీ తాజా ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయంలోకి వెళితే.. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వల్లేనన్న మాట పోలీసుల నోటి నుంచి వస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రాజశేఖర్ కారు వేగం ఏకంగా 180 కిలోమీటర్ల వద్ద ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం వేళ.. స్పీడో మీటర్ ఆగిపోయిన మార్క్ ఈ విషయాన్ని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక.. ప్రమాదానికి గురైన కారు చూస్తే.. ముందు భాగమంతా తుక్కు తుక్కైంది. పూర్తిగా డ్యామేజ్ అయిన కారును ఘటనా స్థలం నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. ప్రమాదానికి గురైన రాజశేఖర్ కారు TS07FZ1234 నెంబరు. దీనిపై పెండింగ్ లో ఉన్న చలానాల్ని చూస్తే.. గతంలోనూ మూడుసార్లు ఓవర్ స్పీడ్ కు చలానాలు పడ్డాయి.
ఇందులో ఒకటి రాచకొండ పరిధిలోకి రాగా.. సైబరాబాద్ పరిధిలో మరో రెండు చలానాలు ఉన్నాయి. మొత్తం రూ.3వేల వరకూ ఫైన్లు కట్టాల్సినవి ఉన్నాయి. ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత రెండోసారి అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవటం చాలా అవసరం.
ఈ విషయంలో రాజశేఖర్ నిలువెత్తు నిర్లక్ష్యంతో ఉన్నారన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది. ప్రమాదానికి గురైన కారును చూస్తున్న పోలీసులు విస్తుపోతున్నారు. ఇంత ప్రమాదం జరిగినా.. ఎలాంటి దెబ్బలు తగలకపోవటం.. నిజంగా చాలా లక్కీగా పలువురు అభివర్ణిస్తున్నారు.