Begin typing your search above and press return to search.

అసలు రజనీ కి ఏమైంది ?

By:  Tupaki Desk   |   29 Oct 2021 6:38 AM GMT
అసలు రజనీ కి ఏమైంది ?
X
ఈ మధ్య తరచు ప్రముఖ సినీ హీరో రజనీకాంత్ ఆసుపత్రు ల్లో చేరుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్ లో అన్నాతై సినిమా షూటింగ్ కు వచ్చిన సమయం లో కూడా రజనీ తీవ్రం గా అనారోగ్యం పాలయ్యారు. వెంటనే సినిమా యూనిట్టే రజనీ ని ఆసుపత్రి లో చేర్పించింది. విషయం తెలియగా నే రజనీ కూతురు చెన్నై నుండి హైదరాబాద్ కు వచ్చారు. వారం రోజుల పాటు చికిత్స్ తర్వాత ప్రత్యేక విమానం లో చెన్నైకి వెళ్ళారు. అప్పట్లో సాధారణ అనా రోగ్యమే అని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని హీరో కూతురు చెప్పింది.

రజనీ కి స్వల్ప అస్వస్ధత తో లేక పోతే సాధారణ అనారోగ్యమే అయితే వారం పాటు ఐసీయూ లో ఉంచి చికిత్స ఎందుకు చేశారు ? మామూలు అనారోగ్యమే అయితే రెగ్యులర్ పరీక్షల కోసమే ఆసుపత్రి కి వస్తే ఎవరినైనా వారం పాటు ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తారా వైద్యులు ? అలాంటి పరిస్ధితే ఇపుడు రజనీకి మళ్ళీ ఎదురైంది. గురువారం ఉదయం చెన్నై లోని ఓ ఆసుపత్రి లో చేరిన వెంటనే రజనీ ని వైద్యులు ఐసీయూ లో ఉంచి చికిత్స చేస్తున్నారు.

ఇపుడు కూడా రజనీ భార్య లత నుండి అదే ప్రకటన. చిన్న అనా రోగ్యంతో రజనీ ఆసుపత్రి లో చేరినట్లు, వైద్యులు పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. మరి చిన్న అనా రోగ్యమే అయితే ఐసీయూ లో చేర్పించి వైద్యం ఎందు కు చేస్తున్నారంటే సమాధానం రాలేదు. హైదరాబాద్ లో వైద్యం చేయించుకుని చెన్నైకి వెళ్ళిన కొద్ది రోజులకే రజనీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానం లో అమెరికాకు వెళ్ళారు.

వైద్య పరీక్షల కోసం+ విశ్రాంతి కోసమే తాను అమెరి కా వెళుతున్నట్లు అప్పట్లో రజనీ చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆమధ్య సింగపూర్ కు వెళ్ళి రజనీ వైద్యం చేయించుకున్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. అంటే రజనీ కి ఏదో సీరియస్ గానే అనా రోగ్య సమస్యలున్నట్లు అర్ధమవుతోంది. అయితే అదేమిటి అనే విషయం లోనే అభిమానులకు, జనాలకు క్లారిటి లేదు. కిడ్నీ సమస్య తో రజనీ చాలా కాలంగా బాధ పడుతున్నట్లు ప్రచారం లో ఉంది.

ఒక వేళ అదే నిజ మైతే కిడ్నీ సమస్య నుంచి బయట పడటానికి రజనీ లాంటి ప్రముఖ సెలబ్రిటీల కు అనేక ప్రత్యామ్నాయ మార్గాలుంటాయి. అలా కాకుండా తరచూ అనా రోగ్యం పాలవుతు, ఆసుపత్రు ల్లో చేరి ఐసీయూల్లో వైద్యం చేయించుకుంటున్నారంటే ఇంకేదో సీరియస్ ప్రాబ్లెం ఉన్నట్లే అర్ధమవుతోంది. మరి ఆ సమస్యే దో ఎప్పటి కైనా బయటపడుతుందా ? ఏమో ఇప్పటి కైతే ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. చూద్దాం చివరకు ఏమవుతుందో.