Begin typing your search above and press return to search.
ప్రతి ఒక్కరూ ఆ పాయింట్‌కే! - రామ్
By: Tupaki Desk | 13 Oct 2018 7:43 PM GMT`హలో గురూ ప్రేమకోసమే` ట్రైలర్ రిలీజవ్వగానే మళ్లీ రామ్ ఓ రొటీన్ సినిమాలో నటిస్తున్నాడనే కామెంట్లు వినిపించాయి. రొటీన్ కామెడీ ఎంటర్‌టైనర్.. రొటీన్ డైలాగులు ట్రైలర్‌లో కనిపించేసరికి క్రిటిక్స్ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీనికి `హలో గురూ ప్రేమకోసమే` ప్రీఈవెంట్‌లో దిల్‌రాజు & టీమ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
దిల్ రాజు మాట్లాడుతూ - ఈ సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్. గంట 10 నిమిషాల పాటు నాన్ స్టాప్‌గా నవ్వుతారు. అంత గొప్పగా కామెడీ పండిందని వివరణ ఇచ్చారు. రామ్ సైతం ఈ సినిమాని త్రినాథరావు గొప్ప టైమింగుతో ఒక ఆడియెన్‌లా ప్రతిదీ చూస్తూ తెరకెక్కించారని తెలిపారు. ``త్రినాథ్ ఒక ఆడియెన్ మొదట. తర్వాతే డైరెక్టర్. సీన్ తీస్తూ.. మానిటర్‌లో చూసేప్పుడే నవ్వేస్తారు. నవ్వు వస్తే కామెడీ పండినట్టే. లేకపోతే లేనట్టే. రాజుగారి జీవితంలో లవ్ స్టోరీస్ ఉన్నాయో లేదో తెలీదు కానీ, ప్రతి సినిమాని ఆయన అలా ప్రేమించి చేస్తారు`` అని అన్నారు.
దేవీశ్రీతో ఆరో సినిమా చేస్తున్నానని రామ్ తెలిపారు. దేవీశ్రీతో అన్నీ చార్ట్ బస్టర్స్. ఆడియో ఇరగ కుమ్ముసింది. ఇలాంటి సినిమాకి దేవీనే ఉండాలనిపించింది. అమెరికాలో షోలు చేస్తూ రాత్రి పగలు ట్యూన్స్ రెడీ చేశాడు. దేవీశ్రీ హార్డ్ వర్క్‌కి హ్యాట్సాఫ్ అన్నారు. అనుపమతో కొన్ని పాటలకు స్టెప్పులు బాగా కుదిరాయని, తనో ఫైన్ ఆర్టిస్టు అని పొగిడేశాడు రామ్. ఓవరాల్‌గా ఇది రొటీన్ కంటెంట్‌తో తెరకెక్కినా ఇందులో ఉన్న ఓ నావెల్ పాయింట్‌కి, రామ్- అనుపమ జంట నటనకు, ప్రకాష్‌రాజ్ కామెడీకి పడిపోతారని వేదిక సాక్షిగా గట్టిగా చెప్పారు.