Begin typing your search above and press return to search.
నా దగ్గరకు అలాంటి స్టొరీలే వస్తున్నాయి!
By: Tupaki Desk | 17 Oct 2018 4:53 AM GMT హీరో రామ్ తాజా చిత్రం 'హలో గురు ప్రేమ కోసమే' అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్ ఎంటర్టైనర్ తప్పకుండా విజయం సాధిస్తుందని రామ్ నమ్మకంగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలో 'మీరు ఎందుకు డిఫరెంట్ స్టొరీలు చేయడం లేదు?' అని అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
"నన్నేం చేయమంటారు చెప్పండి.. ఎక్కువ మంది నాదగ్గరకు రొమాన్స్ స్క్రిప్టులనే తీసుకొస్తారు. వాటిలో నాకు బాగా నచ్చిన వాటిని ఎంచుకుని మిగతావాటిని నేను రిజెక్ట్ చేస్తుంటాను. నా దగ్గరకు గొప్ప స్క్రిప్ట్స్ ఏవీ రావడం లేదు" అన్నాడు రామ్. కారణాలేవైనా కానివ్వండి.. రామ్ మాత్రం రొటీన్ సినిమాలు చేస్తున్నాడన్న అభిప్రాయం చాలామందిలో స్థిరపడిపోయింది. చేస్తే రొమాంటిక్ కామెడీ లేదంటే ఒక మాస్ ఎంటర్టైనర్ తప్ప మరో జోనర్ సినిమా దాదాపుగా చేయడం లేదు.
రామ్ ఇచ్చిన ఆన్సర్ గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం లాగే ఉంది. 'సర్దార్ గబ్బర్ సింగ్' టైమ్ లో 'ఎంతో మంది రైటర్స్ ఉండగా మీరు ఎందుకు కథ రాయవలసి వచ్చింది?' అని అడిగితే.. 'నాదగ్గరకు మంచి కథలు రావడం లేదు అందుకే నేనే సర్దార్ కథ రాశాను.. తప్పనిసరి పరిస్థితుల్లో రాయాల్సి వచ్చింది' అన్నాడు. ఒకవైపు.. హీరోలు కథలు రావడం లేదు అంటున్నారు గానీ.. టాలీవుడ్ లో రెండు నెలలకోసారి ఒక డిఫరెంట్ కంటెంట్ ఉండే సినిమా వస్తోంది. మరి అవి ఎలా వస్తున్నాయో.. రామ్ లాంటి హీరోలు సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే!