Begin typing your search above and press return to search.
పూరి ఇంకా 'డిఫెన్స్' లోనే!
By: Tupaki Desk | 16 Oct 2018 11:11 AM GMTయువహీరోలు కమర్షియల్ హీరోలుగా, బిగ్ స్టార్స్‌గా ఎదగాలంటే పూరి చెయ్యి పడాల్సిందేనన్న చర్చ సాగేది. చరణ్ - బన్ని - ప్రభాస్ - ఎన్టీఆర్ - నితిన్ - గోపిచంద్ లాంటి హీరోలు పూరి వెంట తిరిగి మరీ తనతో సినిమాలు చేశారు. ఇందులో అందరినీ కొత్తగా చూపించడంలో పూరి పెద్ద సక్సెసయ్యాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా, యావరేజు, హిట్టు అనే మాట లేకుండా ఆయా సినిమాల్లో హీరోలు కొత్తగా కనిపించారన్న ప్రశంసలు కురిశాయి. అందుకే ఇప్పటికీ డెబ్యూ హీరోని ఇంట్రడ్యూస్ చేయాలంటే పూరి అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయం ఉంది. అయితే గత కొంతకాలంగా పూరి ట్రాక్ రికార్డ్ ఊహించని రీతిలో బ్యాడ్ అయిపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం.
ఫ్లాపుల నేపథ్యంలో కొందరు హీరోలు తనకు ముఖం చాటేశారని పూరీనే స్వయంగా అంగీకరించే పరిస్థితి. అయినా పూరి అంటే ఇంకా ఏదో ఒక నమ్మకం. ఆ నమ్మకమే ఇంకా పలువురు హీరోలు అతడి గురించి ఆలోచించేలా చేస్తోంది అంటే అతిశయోక్తి కాదు. తనయుడు ఆకాశ్ పూరి హీరోగా ఇటీవలే పూరి తెరకెక్కించిన `మెహబూబా` పరాజయం పాలైన తర్వాత తిరిగి తన కెరీర్‌ని ట్రాక్‌లోకి తెచ్చేందుకు పూరి చాలానే తంటాలు పడుతున్నాడు. ఆ క్రమంలోనే హీరో రామ్‌కి కథ వినిపించాడు.
దీనికి రామ్ ఔనని కానీ, కాదని కానీ చెప్పలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. తాజాగా `హలో గురు ప్రేమకోసమే` ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై ప్రశ్నిస్తే రామ్ ఆన్సర్ ఇచ్చారు. ``కథా చర్చలు సాగుతున్నాయి. కానీ లైన్ ఓకే కాలేదు. ఎప్పటినుండో చర్చలు జరుగుతున్నా ఎగ్జయిటెడ్ స్టోరీ లైన్ కుదరలేదు. దానికోసమే ఎదురుచూస్తున్నాం. అన్నీ కుదిరితే ఆయనతో సినిమా ఉంటుంది. ఏదైనా కథే డిసైడ్ చేస్తుంది`` అని రామ్ కరాఖండిగా చెప్పేశాడు. అంటే పూరి అంతటి పెద్ద స్టార్ డైరెక్టర్ ఏ రేంజులో డిఫెన్స్‌లో పడ్డాడో దీనిని అర్థం చేసుకోవచ్చు. ఒక సీనియర్ దర్శకుడిగా అతడంటే గౌరవం ఉంది.. అభిమానం ఉంది.. కానీ తాను అడగ్గానే ఛాన్సిచ్చే సన్నివేశం లేదని తాజా పరిణామం చెబుతోంది. హీరోలకు నచ్చే కథలు చెప్పాలి. అప్పుడే ఎవరికైనా ఛాన్స్ ఇక్కడ!!