Begin typing your search above and press return to search.
నా బూతులకు రీజన్ కరెక్ట్ గా ఉంటుంది
By: Tupaki Desk | 10 July 2019 2:30 PM GMTరామ్ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా హీరో రామ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా ఈ చిత్రంలో ఉన్న బూతుల గురించి చర్చ జరిగింది. ట్రైలర్ లోనే ఈ చిత్రంలో ఉండబోతున్న బూతులను పరిచయం చేశారు. సినిమాలో మరిన్ని ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
సినిమాలోని బూతుల గురించి రామ్ స్పందిస్తూ.. సినిమాలోని పాత్రను బట్టి లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే శంకర్ పాత్రను బట్టి ఆ డైలాగ్స్ ఉన్నాయని అంతే తప్ప కావాలని పెట్టినవి ఏమీ కాదన్నాడు. సినిమా చూస్తున్న సమయంలో బూతులు ఉండటంను తప్పుబట్టరు. శంకర్ పాత్ర అటువంటిది కనుక పర్వాలేదు అనుకుంటారు. అమ్మానాన్న లేకుండా స్లమ్ లో పెరిగిన కుర్రాడు ఇలా మాట్లాడితేనే సహజంగా ఉంటుందనే అభిప్రాయంను రామ్ వ్యక్తం చేశాడు.
ఈ చిత్రంలో నువ్వు ఎందుకు ఇలా ఉంటావు అంటూ హీరోయిన్ కూడా ఒక సందర్బంలో అడుగుతుంది. అప్పుడు శంకర్ చెప్పే సమాధానం చాలా కన్విన్సింగ్ గా ఉంటుందని రామ్ అన్నాడు. ఇక ఈ చిత్రం ఎలా మొదలయ్యిందనే విషయాన్ని గురించి చెబుతూ దర్శకుడు పూరితో చాలా కాలంగా సినిమా చేయాలని అనుకుంటున్నాను కాని కుదరలేదు. అయితే ఆమద్య మా ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తల కారణంగానే మా ఈ సినిమా ప్రారంభం అయ్యింది. అప్పటి వరకు ఎలాంటి చర్చలు లేవు. ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అప్పుడే సినిమా గురించి మాట్లాడటం జరిగింది. ఈ సినిమాకు కారణం అయిన మీడియా వారికి కృతజ్ఞతలు అన్నాడు.
పూరిని నమ్మి సినిమా చేయడంపై రామ్ స్పందిస్తూ ఆయన ఒక లాటరీ టికెట్ వంటి వారు. సినిమా కొడితే ఓ రేంజ్ లో ఆడుతుంది. నేను ఆయనకు అవకాశం ఇవ్వడం ఏమీ లేదు. ఆయనతో వర్క్ చేయమని చాలా రోజులుగా నా స్నేహితులు మరియు ఫ్యాన్స్ కోరుతున్నారు. అది ఇప్పుడు సాధ్యం అయ్యింది. తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఉందని రామ్ అన్నాడు.