Begin typing your search above and press return to search.

ఎనర్జీ స్టార్ కి మాస్ కెప్టెన్ తోడయ్యాడు

By:  Tupaki Desk   |   25 Dec 2018 12:13 PM IST
ఎనర్జీ స్టార్ కి మాస్ కెప్టెన్ తోడయ్యాడు
X
ఇప్పుడంటే రకరకాలుగా మాస్ ఎలివేషన్స్ చూస్తున్నాం కానీ సినిమాలో హీరో పెడసరిగా మాట్లాడుతూ తాను అనుకున్నది చేసుకుంటూ పోయే ప్రత్యేకంగా శైలిని పరిచయం చేసింది మాత్రం పూరి జగన్నాథే. ఆ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇటీవలి కాలంలో ట్రాక్ రికార్డు పక్కన పెడితే ఇడియట్ - పోకిరి మొదలుకుని టెంపర్ దాకా పూరి బెస్ట్ ని వీటిలో చూడొచ్చు. మెహబూబా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న పూరి తన కేవ్ లో చాలా సీరియస్ గత కొద్దీ నెలలగా స్క్రిప్ట్ విషయంలో తలమునకలై ఉన్నాడు. అది ఎనర్జిటిక్ స్టార్ రామ్ కోసమే అయినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇప్పుడా ఘడియలు వచ్చేసాయి. రామ్ పూరిల కాంబోలో తెరకెక్కబోయే మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. బయటి నిర్మాతతో కాకుండా పూరి తన హోమ్ బ్యానర్ లోనే భార్య లావణ్య సమర్పణలో ఇంకెవరి భాగస్వామ్యం లేకుండా నిర్మించబోతున్నాడు. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుపెట్టి మే విడుదలను టార్గెట్ గా పెట్టుకోబోతున్నారు. దీని కోసమే రామ్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు. హెయిర్ స్టైల్ మార్చుకున్నాడు.

ఆ మధ్య దీని తాలూకు లుక్ వైరల్ అయ్యింది కూడా. గతంలో ఎన్నడూ చూడని మాస్ అవతారంలో రామ్ ని ప్రెజెంట్ చేస్తున్నట్టు గా టాక్. అయితే జానర్ ఏది అనే విషయంలో మాత్రం సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారు. పూరి మార్కు హీరోయిజంతో పాటు రామ్ ఎనర్జీని పర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించే కథతో ఇది ఉంటుందని తెలిసింది. హీరోయిన్ టెక్నీకల్ టీమ్ తదితర వివరాలు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది