Begin typing your search above and press return to search.

ఉస్తాద్ భగత్ సింగ్.. హీరో రామ్ ఫ్యాన్స్ రచ్చ!

By:  Tupaki Desk   |   11 Dec 2022 3:30 PM GMT
ఉస్తాద్ భగత్ సింగ్.. హీరో రామ్ ఫ్యాన్స్ రచ్చ!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో భగత్ సింగ్ అనే సినిమాను ఆదివారం రోజు అధికారికంగా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను చాలా గ్రాండ్ గానే స్టార్ట్ చేసేసారు. అయితే అంతకంటే ముందు ఉదయం ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ ఒకరకంగా బాగానే ఉన్నప్పటికీ కొందరు మాత్రం ట్రోలింగ్ అయితే చేస్తున్నారు.

ముఖ్యంగా యువ హీరో రామ్ పోతినేని ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ విషయంలో కొంత సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం. వస్తాద్ అనే ట్యాగ్ తమ హీరోదని అలా ఎలా వాడుకుంటారు అని కామెంట్ చేస్తున్నారు.

రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాలో వస్తాద్ అనే ట్యాగ్ తో వైరల్ అయ్యాడు. అలాగే అతని ప్రతి సినిమాకు కూడా అతను అదే తరహాలో ట్యాగ్ తో కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు ఆ తరహా టైటిల్ పెట్టడంపై రామ్ ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక రామ్ ఫ్యాన్స్ పై కూడా పవన్ ఫ్యాన్స్ కొందరు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. రామ్ కు పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఫ్యాన్స్ లేకపోయినప్పటికీ అతనికంటూ ఒక స్పెషల్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇక ఆ కొద్దిమంది పవన్ ఫ్యాన్స్ కు దీటుగా సమాధానం చెబుతూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రామ్ మాత్రం గతంలో పవన్ కళ్యాణ్ పై చాలా పాజిటివ్గా కామెంట్స్ అయితే చేశాడు.

అంతేకాకుండా గతంలో పవర్ స్టార్ బ్రాండ్ చాలా పవర్ఫుల్ అనే ట్వీట్ కూడా చేయడంతో దాన్ని కూడా పవన్ ఫ్యాన్స్ ట్రీట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వస్తాద్ ట్యాగ్ తమ హీరోది అని అనవసరంగా దాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది ఇప్పుడు రామ్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే ఈ గొడవ మాత్రం పెద్దగా వైరల్ అయ్యే అవకాశం అయితే లేదు.

రామ్ కూడా ఎక్కడ అందుకు సంబంధించిన టైటిల్ గాని ట్యాగ్ గాని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు పవన్ సినిమాకు దీన్ని వాడుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఈ టైటిల్ పై ఇంకా ఇలాంటి అభ్యంతరాలు వస్తాయో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.