Begin typing your search above and press return to search.
ఫేవరెట్ సక్సెస్ కోసం అభిమాని సాహసం!
By: Tupaki Desk | 10 July 2019 4:24 AM GMTహీరో రామ్ కు హిట్ రావాలని సందీప్ కుమార్ అనే అభిమాని చేసిన సాహసం చూసి షాక్ కి గురవుతున్నారంతా. ఇంతటి వీరాభిమానం వుంటుందా? అని ఆశ్చర్యపోతున్నారు. `ఉన్నది ఒకటే జిందగీ` తరువాత రామ్ కు చెప్పుకోదగ్గ హిట్ లేదు. తాజాగా తనలానే సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో కలిసి `ఇస్మార్ట్ శంకర్` సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడదల కాబోతోంది. ఇది ఎలాగైనా భారీ విజయాన్ని దక్కించుకోవాలని సందీప్ కుమార్ మోకాళ్లపై తిరుమల మెట్లెక్కడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తరువాత `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ కావాలని ట్వీట్టర్ లో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. అది చూసిన హీరో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే ట్విట్టర్ లో స్పందించారు.
``మీరు చూపించే ప్రేమకు కొన్ని సార్లు మేం అర్హులమేనా అని అనిపిస్తుంటుంది. ప్రియమైన సందీప్ నీ వీడియోను చూశాను. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే వుందని అనుకుంటున్నాను. నీవు చూపించిన ప్రేమ నా హృదయాన్ని తాకింది. షాక్ కు గురిచేసింది. మీరు ఇంత ప్రేమ అభిమానం చూపించడానికి నేనేం చేశానో అర్థం కావడం లేదు. కానీ మీ లాంటి వారి కోసం నా గుండె కొట్టుకుంటూనే వుంటుంది. నిజంగా నేను కృతజ్ఞుడిని`` అని రామ్ ఎమోషన్ అయ్యారు.
అయితే సందీప్ కుమార్ చేసిన పిచ్చి పనికి మాత్రం చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమానం వుండటం వరకు ఓకే కానీ మరీ ఇంతలా చేయాలా? అని చీవాట్లేస్తున్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ తాము అభిమానించే వారిపై తమ అభిమానాన్ని చూపించాల్సిన తీరు ఇది కాదని.. ఏదైనా సహాయక కార్యక్రమాలు చేసి తమ అభిమానాన్ని చాటు కోవాలని.. అలా కాకుండా ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయకూడదని హితవు పలుకుతున్నారు. అభిమానికి మీనింగ్ కనిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు కదా!!