Begin typing your search above and press return to search.

తప్పులు చేయడం సహజం - రామ్‌

By:  Tupaki Desk   |   12 Dec 2015 5:52 AM GMT
తప్పులు చేయడం సహజం - రామ్‌
X
యంగ్ హీరో రామ్ కెరీర్ ప‌రంగా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. ఇప్ప‌టికీ నేర్చుకుంటూనే ఉన్నాడు. క‌మ‌ర్షియ‌ల్ కంటెంట్‌తో సినిమా తీసినంత మాత్రాన జ‌నాలు ఆద‌రించ‌రు. క‌థ క‌మామీషు ప‌క్కాగా ఉండాల‌న్న సంగ‌తి అత‌డు న‌టించిన గత సినిమాలు నిరూపించాయి. ఒంగోలు గిత్త‌ - ఎందుకంటే ప్రేమంట‌ - శివ‌మ్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ప్లాప్ అవ్వ‌డం వెన‌క అస‌లు కార‌ణాల్ని ఇప్ప‌టికీ అన్వేషిస్తూనే ఉన్నాడు.

ఎంత‌టివారైనా త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం. ఇదో నిరంత‌ర ప్ర‌క్రియ‌. అస‌లు త‌ప్పేంటి? అన్న‌ది తెలుసుకున్న రోజు అత‌డికి త‌ప్ప‌కుండా విజ‌యం ద‌క్కుతుంది. స‌రిగ్గా అలాంటి క్రిటిక‌ల్ టైమ్‌లోనే నేను శైల‌జ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమా ఓ చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్రం. గుండెల్ని ట‌చ్ చేసే సినిమా. ఇందులో నేను ఓ నైట్ క్ల‌బ్‌లో ప‌నిచేసే డీజేగా క‌నిపిస్తాను. ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా క్యారెక్ట‌ర్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే శైల‌జ‌తో ప్రేమాయ‌ణం ఎలా మొద‌లైంది? అన్న‌ది మాత్రం ఇంకా రివీల్ చేయ‌లేదు. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ స్ట‌ఫ్‌కి దూరంగా తెర‌కెక్కించిన రియ‌లిస్టిక్ ల‌వ్‌స్టోరీ ఇద‌ని మాత్రం చెబుతున్నాడు.

రామ్‌లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే గ‌త త‌ప్పిదాలేంటో అర్థం చేసుకుని ఈసారి పూర్తి స్థాయి ప‌రిణ‌తితో వ‌స్తున్నాడ‌నే అనిపిస్తోంది. పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించింది. పెర్ఫామెన్సెస్‌కి బాగా స్కోప్ ఉన్న సినిమా ఇద‌ని చెబుతున్నాడు రామ్‌. జ‌న‌వ‌రి 1న సినిమా రిలీజ‌వుతోంది. ఎనీ వే.. ఆల్ ది బెస్ట్ రామ్‌.