Begin typing your search above and press return to search.

ఎనర్జిటిక్ హీరో కొత్త లుక్ కేక

By:  Tupaki Desk   |   29 Nov 2016 3:54 AM GMT
ఎనర్జిటిక్ హీరో కొత్త లుక్ కేక
X
ఇప్పుడు టాలీవుడ్ కుర్ర హీరోలంతా కొత్త లుక్స్ ట్రై చేస్తున్న సంగతి ముందే చెప్పుకున్నాం. ముఖ్యంగా కుర్రాళ్లంతా గెడ్డంతో కొత్తగా కనిపించేందుకు తెగ తాపత్రయపడిపోతున్నారు. ఇందులో హీరో రామ్ కూడా ఉన్నాడనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ సారి తను గెడ్డం పెంచుతున్న సంగతిని హింట్ ఇవ్వడంతో పాటు.. ఫోటో కూడా చూపించిన రామ్.. ఇప్పుడు ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు.

కేవలం నాలుగంటే నాలుగు సెకన్ల నిడివి ఉండే ఈ వీడియోలో.. కార్ డ్రైవ్ చేస్తున్న ఎనర్జిటిక్ హీరో.. జస్ట్ ఓ సారి చెయ్యూపి హలో అంటాడంతే. హలో సంగతి పక్కన పెడితే.. రామ్ స్టైలింగ్ అదిరిపోయిందని చెప్పాల్సిందే. డిఫరెంట్ గా కట్ చేసిన హెయిర్ స్టైల్.. ఓ పద్ధతి ప్రకారం పెంచిన గెడ్డం.. రామ్ లోని మ్యాన్లీ నెస్ ని చూపిస్తుంటే.. ఎనర్జీ లెవెల్స్ మరింతగా పెరిగిపోయినట్లు అనిపించక మానదు. ఇక ఆ కళ్లజోడు.. ఈ హీరో స్టైల్ ను మరింతగా ఇనుమడింపచేసేశాయి.

ఈ లుక్ కొత్త సినిమాలో చూపించేందుకు పెంచుతున్నాడని అనుకోవచ్చు కానీ.. రామ్ ఇంకా ఏ మూవీ ఫైనల్ చేయలేదు. కరుణాకరన్ దర్శకత్వంలో ఓ మూవీ ఖాయమైందనే న్యూస్ ఉంది కానీ.. అది అఫీషియల్ కాదు. మిగిలిన మాటలు.. చర్చలు అయిపోయాక.. డిసెంబర్ లో ఈ మూవీని అనౌన్స్ చేసి.. జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తాడట రామ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/