Begin typing your search above and press return to search.
రామ్ బాబుకు పెద్ద ప్రొడ్యూసర్లే దొరికారు
By: Tupaki Desk | 4 April 2016 3:30 PM GMT1 నేనొక్కడినే.. ఆగడు.. కొట్టిన దెబ్బల నుంచి పూర్తిగా కోలుకున్నట్లే ఉంది 14 రీల్స్ సంస్థ. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ను చిన్న సినిమాగా మొదలుపెట్టి పెద్ద రేంజికి తీసుకెళ్లి.. మంచి లాభాల్ని అందుకున్న ఆ సంస్థ.. ఇక వరుసగా సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేసుంకుంటోంది. ఆల్రెడీ ప్రతిష్టాత్మకమైన బాలయ్య వందో సినిమాను భుజాలకెత్తుకున్న 14 రీల్స్.. దీంతో పాటుగా మీడియం రేంజి సినిమాలు కూడా నిర్మించబోతోంది. ఇటీవలే ‘నేను శైలజ’తో మంచి విజయాన్నందుకున్న రామ్ హీరోగా 14 రీల్స్ ఓ సినిమా నిర్మించబోతోంది.
‘కందిరీగ’ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ తో రామ్ మళ్లీ ఓ సినిమా చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థే నిర్మించబోతున్నట్లు సమాచారం. రామ్ ఎనర్జీకి తగ్గట్లుగా సంతోష్ శ్రీనివాస్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సబ్జెక్టును రెడీ చేసినట్లు సమాచారం. ‘రభస’ తర్వాత రెండేళ్లు కనిపించకుండా పోయిన శ్రీనివాస్ మీద నమ్మకం పెట్టి రామ్.. 14 రీల్స్ నిర్మాతలు సినిమా చేసే అవకాశమివ్వడం విశేషమే. రామ్ కూడా చాన్నాళ్ల తర్వాత బయటి సంస్థలో సినిమా చేయబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లు సమాచారం. హీరోయిన్ ఎవరో ఇంకా నిర్ణయించలేదు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.