Begin typing your search above and press return to search.

ఆడాళ్ళ ప్రాజెక్ట్ రామ్ మొదలెడుతున్నాడా?

By:  Tupaki Desk   |   1 March 2017 12:30 AM GMT
ఆడాళ్ళ ప్రాజెక్ట్ రామ్ మొదలెడుతున్నాడా?
X
హీరో రామ్ ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడు? కరుణాకరన్ తో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోందా? అసలు వేరే ఇతర సినిమా ఏదైనా పట్టాలెక్కిందా? ఇలాంటి అనుమానాలు అభిమానులకు చాలానే ఉన్నాయి. కండలు తిరిగిన బాడీని.. కొత్త హెయిర్ స్టయిల్ ను తెగ చూపిస్తున్న రామ్.. అసలు తన తదుపరి సినిమా ఏం చేస్తున్నాడో ఎందుకు చెప్పట్లేదో కాని.. ఇప్పుడు మరో న్యూస్ ఒకటి వచ్చేసింది.

నిజానికి ''హైపర్'' సినిమా హిట్టయ్యి ఉంటే.. వెంటనే రామ్ మరో సినిమాను అప్పుడే చేసేశేవాడు. కాని ఆ సినిమా ఫ్లాపవ్వడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు హిట్ కావాలంటే ''నేను శైలజ'' తరహా సినిమాలు చేయాలా లేకపోతే ఇంకేదైనా ప్రయత్నించాలా అనే డైలమోలో పడిపోయాడు. అదే సమయంలో నేను శైలజ తీసిన కిషోర్ తిరుమల అటు వెంకటేష్‌ తో ''ఆడాళ్ళు మీకు జోహార్లు'' అంటూ ఒక సినిమాను చేయాల్సి ఉంది. అందులో నిత్యా మీనన్ హీరోయిన్ గా తేజస్విని మదివాడ మరో హీరోయిన్ గా ఓకె అయ్యారు. కారణాలు తెలియదు కాని.. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.

అందుకే ఇప్పుడు రామ్ అండ్ కిషోర్ తిరుమల కలసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు. కాకపోతే ఆడాళ్ళు మీకు జోహార్లు అనేది ఒక లేటు వయస్సు హీరోకు యంగ్ హీరోయిన్ కు సాగే ప్రేమ కథ. ఇప్పుడు ఆ రోల్ ను వయస్సులో చిన్నవాడైన రామ్ చేస్తే బాగుంటుందా? లేదంటే వీరిద్దరూ ఏదైనా కొత్త కథతో సినిమా చేస్తున్నారేమో. వెయిట్ అండ్ సీ.