Begin typing your search above and press return to search.

ఆ విషయం ఇంకా డిసైడ్ కాలేదు

By:  Tupaki Desk   |   13 Oct 2016 10:30 PM GMT
ఆ విషయం ఇంకా డిసైడ్ కాలేదు
X
ఎనర్జిటిక్ హీరో రామ్ బోలెడంత స్పీడ్ చూపించేస్తాడని అంతా అనుకున్నారు. నేను శైలజ సక్సెస్ తర్వాత షార్ట్ గ్యాప్ లోనే హైపర్ స్టార్ట్ చేసేయడం.. అది సెట్స్ పై ఉండగానే పటాస్ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ ఖాయం అయిందని చెప్పడం లాంటివి జరగడంతో.. మళ్లీ రామ్ ఫుల్లు స్పీడ్ చూపించేస్తాడనే ఫ్యాన్స్ ఆశించారు. కానీ రామ్ కి మాత్రం హైపర్ పెద్ద షాక్ నే ఇచ్చింది.

ఫాదర్ సెంటిమెంట్ ఉందని ఎంతగా మొత్తుకున్నా సరే.. ఈమూవీని మాస్ మూవీగానే చూశారు జనాలు. రిజల్ట్.. రామ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడిపోయింది. దసరా పండుగ సీజన్ ని కూడా క్యాష్ చేసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. హైపర్ ఇచ్చిన షాక్ తో నెక్ట్స్ ప్రాజెక్టు విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు రామ్. ఇప్పటికే చాలా స్టోరీస్ విన్నాడు కానీ.. వీటిలో ఏది యాక్సెప్ట్ చేయాలో అర్ధం కాని పరిస్థితి. కరుణాకరన్ డైరెక్షన్ లో ఓ సినిమా.. అలాగే నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరక్షన్ లో మరో సినిమా చేసేందుకు సిగ్నల్ ఇచ్చాడు కానీ.. ఆప్రాజెక్టులు ఇంకా ప్రారంభించడంలో మాత్రం ఆలస్యం చేస్తున్నాడు.

మరోవైపు ఇప్పటికే పటాస్ డైరెక్టర్ తో తలపెట్టిన సినిమా ఆగిపోయిందని డైరెక్టుగానే చెప్పేశారు. ఇప్పుడు మరోసారి లవ్ స్టోరీ చేయాలా లేక మాస్ మసాలా ఎంటర్టెయినర్ తో మరో ట్రయల్ వేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాడు రామ్. ఓ అభిమానిగా మీరైతే ఎలాంటి సలహా ఇస్తారో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/