Begin typing your search above and press return to search.

బాబూ రామ్.. సినిమా ఉందా లేదా?

By:  Tupaki Desk   |   23 Dec 2016 3:30 AM GMT
బాబూ రామ్.. సినిమా ఉందా లేదా?
X
వరుస ఫ్లాపుల నుంచి బయటపడి ఈ ఏడాది ‘నేను శైలజ’తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో రామ్. కానీ ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. ‘నేను శైలజ’ లాంటి భిన్నమైన సినిమాతో హిట్టు కొట్టిన అతను.. మళ్లీ తన పాత దారిలో ‘హైపర్’ లాంటి మాస్ సినిమా చేసి బోల్తా కొట్టాడు. దీంతో తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని అయోమయంలో పడిపోయినట్లున్నాడు రామ్. ముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో అంధుడి పాత్రలో ఓ సినిమా చేస్తాడని అన్నారు. కానీ ఆ ప్రాజెక్టు అనివార్య కారణాల వల్ల ఆగిపోవడంతో కరుణాకరన్ తో సినిమా చేయడానికి తయారయ్యాడు రామ్. ఐతే ఈ సినిమా గురించి కన్ఫర్మేషన్ వచ్చి రెండు నెలలవుతున్నా.. మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు.

ముందు ఓ సినిమా గురించి ప్రకటన రావడం.. ఆ తర్వాత ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడం అన్నది ఈ మధ్య టాలీవుడ్లో మామూలైపోయింది. రామ్-కరుణాకర్ మూవీ కూడా ఆ కోవకే చెందుతుందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య గడ్డం మీసం భారీగా పెంచి ఈ మధ్య డిఫరెంట్ లుక్ లో దర్శనమిచ్చాడు రామ్. తన తర్వాతి సినిమా ఓకే అయ్యాక లుక్ ఫైనలైజ్ చేద్దామని అతను భావిస్తున్నట్లున్నాడు. కరుణాకరన్ తో రామ్ ఇంతకుముందు చేసిన ‘ఎందుకంటే ప్రేమంట’ అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఈ కాంబినేషన్ కు ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ లేదు. అసలే రామ్ కెరీర్ కొంచెం ఎగుడుదిగుడుగా ఉంటే.. పోయి పోయి కరుణాకరన్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో ఇప్పుడు సినిమా అవసరమా అని సన్నిహితులు చెబుతుండటంతో ఆ ప్రాజెక్టును రామ్ హోల్డ్ లో పెట్టి వేరే దర్శకులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ‘హైపర్’ రిలీజై దాదాపు మూడు నెలలైపోతున్న నేపథ్యంలో త్వరగా సినిమా ఫైనలైజ్ చేయకపోతే.. రామ్ కెరీర్లో పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/