Begin typing your search above and press return to search.
టాలీవుడ్ యంగ్ హీరోకి నష్టం తప్పేలా లేదుగా..!
By: Tupaki Desk | 11 April 2020 6:00 AM GMTదేశంలో కరోనా ఎఫెక్ట్ రోజు రోజుకీ ఎక్కువవుతోంది. దీని తీవ్రత మరీ ఎక్కువవుతుండటం - దేశంలో మరణాలతో పాటు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ప్రకటించారు. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుందని తెలిసినా దేశ ప్రజలని రక్షించాలనే ఉద్దేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో చాలా వరకు సినిమాల రిలీజ్‌లు వాయిదా వేయాల్సిన పరిస్థితి. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం `రెడ్`. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్రమిది. తమిళ హిట్ చిత్రం `తడమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ - మాళవికా శర్మ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందు ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. లాక్ డౌన్ ఏప్రిల్ 15 వరకు పొడిగించడంతో ఈ చిత్ర రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం రామ్ రెడ్ సినిమా గురించి ఒక వార్త నెట్టింట్ లో హల్ చల్ అవుతుంది. అయితే ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగితే రెడ్ సినిమాకి కష్టాలు తప్పవనే చెప్పాలి. రెడ్ కి పోటీగా హాలీవుడ్ జేమ్స్ బాండ్ 'నో టైం టు డై' సినిమా రాబోతుంది. ఈ సినిమా గనుక రెడ్ కి పోటీగా భారీ రేంజ్ లో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది హీరో రామ్.
ఈ రెండు సినిమాలు లాక్ డౌన్ తర్వాత రిలీజ్ ప్లాన్ చేస్తే ఒకేసారి విడుదల అవుతాయని టాక్ వినిపిస్తుంది. జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ సినిమా కదా అని పొరబడడానికి వీలులేదు. ఎందుకంటే జేమ్స్ బాండ్ ని తెలుగులో భూలోక వీరుడు 007 అనే పేరుతో ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. బి సి సెంటర్స్ పరిధిలో ఇండియాలో జేమ్స్ బాండ్ కి ఆదరణ ఎక్కువే. అడల్ట్ సీన్లు - యాక్షన్ సీన్లు ఏవైనా మనవాళ్ళు ఆదరిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. అన్నీ కుదిరితే రెడ్ సినిమాను ఢీకొట్టే సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి జాగ్రత్తగా ఉండక తప్పదు రెడ్ నిర్మాతలు అని చెప్పకనే చెప్తున్నట్లుగా ఉందంటున్నాయి సినీ వర్గాలు.