Begin typing your search above and press return to search.
సిల్క్ స్మిత మృతికి ఆ హీరో కారణమా?
By: Tupaki Desk | 19 Jan 2022 9:31 AM GMTసిల్క్ స్మిత.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. మలయాళ సినిమాతో నటిగా కెరీర్ ప్రారభించిన వడ్లపట్ల విజయలక్ష్మీ ఆ తరువాత సిల్క్ స్మితగా మారి దక్షిణాదిలో సంచలనాలు సృష్టించింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధల తరువాత వ్యాంప్ పాత్రలతో పాటు ప్రత్యేక గీతాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. గ్లామర్ పాత్రల్లో నటిస్తూ ఎంతో మంది యువ హృదయాల్లో ఆరాధ్య దేవతగా నిలిచి ఎవరూ ఊహించిన క్రేజ్ ని సొంతం చేసుకుంది.
ఏ హీరో సినిమాలో నటించినా సిల్క్ స్మిత ప్రత్యేక గీతం వుందంటే ఆ సినిమాకే ఆ పాట సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచేది. కేవలం ఆమె పాట కోసమే సినిమా థియేటర్లకు జనాలు వెళ్లిన రోజులు వున్నాయంటే సిల్క్ స్మిత క్రేజ్ ఏ స్థాయిలో వుండేదన్నది అర్థం చేసుకోవచ్చే. చాలా మంది స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాల విజయాల్లో సిల్క్ స్మిత పాత్ర వుంది. అంతలా ఆమె పాటలు ఆయా సినిమాల విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించాయి.
అలాంటి సిల్క్ స్మిత కొన్నేళ్ల క్రితం మృతి చెందడం తీవ్ కలకలాన్ని రేపింది. ఇంట్లో ఉరివేసుకుని ఆమె చనిపోవడం అప్పట్లో పెద్ద మిస్టరీగా మారింది. అఫ్ కోర్స్ సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె ఎందుకు చనిపోయింది? .. అలా చనిపోవడానికి కారణం ఎవరు? అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే మిగిలింది. క్రేజీ హీరోయిన్ దివ్యభారతి మరణం ఎలా మిస్టరీగా మిగిలిపోయిందో సిల్క్ స్మిత మరణం కూడా అలాగే మిస్టరీగా మిగిలి ఇప్పటికీ ప్రతీ ప్రేక్షకుడి మదిని తొలుస్తోంది.
అయితే సిల్క్ స్మిత మృతి చెందడానికి ఓ హీరో కారణమని తాజాగా ఓ వార్త బయటికి వచ్చింది. తనతో కొంత కాలం ప్రేమాయణం నడిపిన సదరు హీరో .. స్మిత మధ్యం మత్తులో వుండగా అమె ఆస్తుల్ని రాయించుకున్నారని, తనువాత ననని మోసం చేయడమే కాకుండా దూరం పెట్టడంతో సిల్క్ స్మిత మద్యానికి బానిసగా మారిందని, ఆ మత్తులోనే జీవితంపై విరక్తి చెంది ఆత్మ హత్యకు పాల్పడిందని చెబుతున్నారు.
సిల్క్ స్మిత స్టార్ గా బిజీగా వున్న సమయంలో నిర్మాతగా మారి పలు చిత్రాలని నిర్మించారు. వాటి వల్ల ఆమె చాలా నష్టపోయారట. ఇది కూడా ఆమె మరణానికి మరో కారణం అని చెబుతున్నారు. సిల్క్ స్మిత అనుమానాస్పదంగా 1996 సెప్టెంబర్ 23న మృతి చెందారు. ఆత్మ హత్య చేసుకుని ఆమె మృతిచెందారు. ఆమె మరణించి ఇన్నేళ్లవుతున్నా ఆమె మృతి వెనకున్న మిస్టరీ మాత్రం వీడటం లేదు. ప్రతీ సారి ఏవేవో స్టోరీలు తెరపైకి వస్తున్నాయి.