Begin typing your search above and press return to search.

దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు

By:  Tupaki Desk   |   4 Feb 2019 6:07 AM GMT
దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు
X
ఇండియాలో సచిన్‌ అనగానే అందరికి కూడా వెంటనే గుర్తుకు వచ్చేది క్రికెట్‌ దేవుడు సచిన్‌. క్రికెట్‌ లో అద్బుతాలు సృష్టించి చిన్న వయస్సులోనే ఎన్నో రికార్డులను దక్కించుకుని, ప్రపంచ రికార్డులను మరెవ్వరికి సాధ్యం కానంతగా సాధించిన సచిన్‌ టెండూల్కర్‌ కాకుండా మరో సచిన్‌ కూడా ఉన్నాడు. సచిన్‌ అని పేరు పెట్టుకున్నందుకు ఆయనంత పేరు గుర్తింపు దక్కించుకోవాలనేది ఈయన కోరికగా తెలుస్తోంది. వ్యాపారాలతో కోట్లు సంపాదిస్తున్నా కూడా సంతృప్తి చెందకుండా సినిమాల్లో నటిస్తూ సరదా తీర్చుకుంటూ ఉంటాడు.

బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమల్లో కూడా సచిన్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆమద్య తెలుగులో కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. కాని ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఈయన్ను కనుమరుగు అయ్యేలా చేశాయి. మామూలుగా అయితే ఒక హీరోకు ఈ స్థాయిలో ఫ్లాప్స్‌ వస్తే మళ్లీ కనిపించే అవకాశం కూడా లేదు. కాని సచిన్‌ మాత్రం సొంత డబ్బులు పెట్టుకుని సినిమాలు తీస్తూ వస్తున్నాడు. తెలుగు, హిందీల్లో సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు ఒక్కటి అన్నట్లుగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఆమద్య వీడెవ్వడు చిత్రంను చేశాడు. ఈ చిత్రం పేరు చెబితే ప్రేక్షకులు ఆ సినిమా కూడా ఉందా అంటారు. అలాంటి సినిమాలు సచిన్‌ చాలానే చేశాడు. ఇప్పుడు సచిన్‌ హిందీలో మరో సినిమాను సొంతంగా చేస్తున్నాడు. దాన్ని తెలుగులో 'అమావాస్య' అనే టైటిల్‌ తో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ నర్గీస్‌ ఫక్రీ హీరోయిన్‌ గా నటించింది.

బాలీవుడ్‌ లో కాస్త ఆసక్తి ఉన్న ఈ చిత్రంకు టాలీవుడ్‌ లో మాత్రం అసలు గుర్తింపే లేదు. ఈ సినిమాను సొంతంగా సచిన్‌ విడుదల చేయాల్సిందే. సక్సెస్‌ రాకున్నా కూడా సరదాగా అన్నట్లుగా సచిన్‌ బాక్సాఫీస్‌ వద్ద దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ దండయాత్రలో ఎప్పుడైనా సక్సెస్‌ అవుతానేమో, దాంతో తనకు క్రేజ్‌ దక్కుతుందేమో, గుర్తింపు వస్తుందేమో అనేది సచిన్‌ ఆలోచన అయ్యి ఉంటుంది. పాపం రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్న సచిన్‌ కు మరో దశాబ్దం తర్వాత అయినా సక్సెస్‌ అనేది దక్కుతుందేమో చూడాలి.