Begin typing your search above and press return to search.
లెజెండ్ మంచి సినిమానే.. కానీ..
By: Tupaki Desk | 18 Nov 2017 5:38 AM GMTలెజెండ్ మూవీకి నంది అవార్డులు కట్టబెట్టడం.. ఇతర సినిమాలను నిర్లక్ష్యం చేయడం అంశంపై వివాదం ముదురుతూనే ఉంది. ఇప్పుడు హీరో శివాజీ రాజా లెజెండ్ మూవీకి ఆ స్థాయి ఉందని అంటూనే.. మరో యాంగిల్ ని బయటకు తీశాడు.
తాను ఈ నంది కమిటీ జ్యూరీ గురించి మాత్రమే మాట్లాడలేదని అంటూ.. ఇండస్ట్రీలో భజనగాళ్లు ఉంటారని అన్నాడు. ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేసిందనే టాక్ ఉండగా.. శివాజీ మాత్రం అసలు ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి సంబంధం ఉండదని.. మెప్పు కోసం కొందరు ఇలా కావాలని చేస్తుంటారని అన్నాడు. ఇదో ప్రైవేటు వ్యవహారం కదా అని శివాజీ అనేయడం విశేషం. ఇవి ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కదా అన్నపుడు.. 'అవార్డులు ప్రభుత్వమే ఇచ్చినా.. దానికి సంబంధించిన జ్యూరీ కమిటీ మెంబర్లు అందరూ సినిమా రంగానికి చెందిన వారే.. ప్రైవేట్ వ్యక్తులే' అని తేల్చేశాడు శివాజీ.
అవార్డు రాని వాళ్లే కాంట్రవర్సీ చేస్తున్నారనే వాదనను కూడా శివాజీ ఖండించాడు. ఎవరి బాధను వారు చెప్పుకుంటారని.. కాదనే హక్కు ఎవరికీ ఉండదని అన్నాడు శివాజీ. నంది అవార్డులను కూడా ప్రైవేటు ఈవెంట్స్ మాదిరిగా నిర్వహిస్తే.. స్పాన్సర్స్ ద్వారా బోలెడంత ఆదాయం వస్తుందని.. ఇలాంటి వివాదాలకు అప్పుడు తావుండదంటూ తనదైన పరిష్కారం అందించాడు శివాజీ.