Begin typing your search above and press return to search.
హీరో సిద్ధార్థ్ మళ్లీ మళ్లీ అదే తప్పు!
By: Tupaki Desk | 10 July 2019 5:19 AM GMTకోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఎలాంటి వారికైనా ముప్పు తిప్పలు తప్పవు. తనకోపమే తన శత్రువు! అన్న చందంగా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మీడియా విషయంలో కోపం స్టార్లకు అతి పెద్ద శత్రువు. ఇప్పటికే ఆ సంగతిని పలువురు హీరోలు ప్రాక్టికల్ గానే గ్రహించారు. సౌత్ స్టార్ హీరో సిద్ధార్థ్ షార్ట్ టెంపర్ గురించి చాలా కాలం క్రితం టాలీవుడ్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగింది. అతడు నటించిన సినిమాలకు నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చిన వారిపై సిద్ధార్థ్ నోరు పారేసుకున్నాడని ప్రచారమైంది. అయితే ఆ తర్వాతా జర్నలిస్టుల విషయంలో సిద్ధార్థ్ ఏమాత్రం తగ్గలేదని ఇటీవల కొన్ని ఈవెంట్లు చెబుతున్నాయి. అప్పట్లో తమిళనాట ఓ కార్యక్రమంలో జర్నలిస్టుపై సిద్ధార్థ్ మాట జారాడని ప్రముఖంగా వార్తలొచ్చాయి. సిద్ధార్థ్ కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నారని మీడియాలో హైలైట్ గా ప్రచారం కావడంతో దానిపై ఫ్యాన్స్ లో చర్చ సాగింది. సిద్ధార్థ్ నటించిన గృహం రిలీజ్ సమయంలో పలు యూట్యూబ్ చానెళ్ల తీరుతెన్నులపైనా చాలా సీరియస్ అవ్వడం చర్చకొచ్చింది.
తాజాగా `ది లయన్ కింగ్` ప్రమోషన్స్ లో సిద్ధార్థ్ కోపం కోలీవుడ్ మీడియాలో డిబేట్ కి తెర తీసింది. తమిళ సినిమాల ప్రమోషన్స్ కి అయితే హీరోలెవరూ హాజరు కారు కానీ.. డబ్బింగు సినిమాల కోసం అటెండవుతున్నారా? అని ఓ జర్నలిస్ట్ హీరో సిద్ధార్థ్ ని ప్రశ్నించారు. దానికి సిద్ధార్థ్ కాస్తంత కోపంగానే ఆన్సర్ ఇవ్వడంతో జర్నలిస్టుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇంతకీ సిద్ధార్థ్ ఏమని ఆన్సర్ చేశారు? అంటే.. ``ఇతరుల మాటేమో కానీ.. నా సినిమా ప్రమోషన్లకు నేను విధిగా హాజరవుతున్నా. అయినా ఈ ప్రశ్నను ఎవరైతే హాజరుకావడం లేదో వాళ్లనే అడగాల్సింది. నన్ను కాదు`` అంటూ సిద్ధార్థ్ రుసరుసలాడారట. `ది లయన్ కింగ్` తమిళ వెర్షన్ కి అరవింద స్వామి సహా హీరో సిద్ధార్థ్ ఓ కీలక పాత్రకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులోనూ ఈ సినిమాకి నాని- జగపతిబాబు లాంటి స్టార్లు వాయిస్ అందించిన సంగతి తెలిసిందే.