Begin typing your search above and press return to search.
టాలీవుడ్ పై గజనీ మహమ్మద్ లా!!
By: Tupaki Desk | 2 May 2019 7:43 AM GMTచాక్లెట్ బోయ్... లవర్ బోయ్ ఇమేజ్ అంటే సిద్ధార్థనే గుర్తుకొస్తాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. బొమ్మరిల్లు.. బోయ్స్ లాంటి సినిమాల్ని అంత తేలిగ్గా మర్చిపోలేరు యూత్. గాళ్స్ లో సిద్ధార్థ్ కి ఉన్న ఫాలోయింగ్ పీక్స్. తెలుగు- తమిళ పరిశ్రమల్లో టాప్ రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలచినది! అన్న చందంగా సిద్ధార్థ్ కెరీర్ పరంగా వెనకబడడం ఊహించనిది. ఇది స్వయంకృతం అన్న విమర్శలు ఉన్నాయి. ఎఫైర్లు అతడి లైఫ్ లో ఊహించని పరిణామాలకు కారణమని సన్నిహితులు చెబుతారు. ఒకానొక సందర్భంలో తెలుగు మీడియా విషయంలో కాస్త యారొగెన్సీ చూపించి ఇబ్బందుల పాలయ్యాడని విమర్శలొచ్చాయి. అందరి అభిమాన కథానాయకుడు.. చేజేతులా కెరీర్ ని నాశనం చేసుకున్నాడని ప్రచారమైంది.
సౌత్ ఇండస్ట్రీస్ లో ఎనిమిది మంది కథానాయికలతో ఆఫ్ ద స్క్రీన్ రొమాన్స్ చేసిన ఏకైక హీరో సిద్ధార్థ్.. వైఫ్ నుంచి విడిపోయిన సిద్ధార్థ్ పలువురు అగ్ర కథానాయికలతో ఎఫైర్లు సాగించాడని ఓ ప్రముఖ తమిళ క్రిటిక్ అప్పట్లో సిద్ధార్థ్ బర్త్ డే రోజున ఓ ఆర్టికల్ ప్రచురించడం సంచలనమైంది. ఇక కథానాయికల శాపనార్థాలే అతడి వెనకబాటుకు కారణమయ్యాయని ఆ ఆర్టికల్ లో ప్రస్థావన వచ్చింది. అదంతా అటుంచితే .. సిద్ధార్థ్ పలుమార్లు తెలుగు సినీపరిశ్రమలో తనని తాను నిరూపించుకునేందుకు చేయని ప్రయత్నమే లేదు. పలుమార్లు గజినీలా దండయాత్ర చేశాడు. ఫామ్ కోల్పోయినా ఎట్టి పరిస్థితిలో తిరిగి పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటానని పంతానికి దిగాడు. కానీ తాను ఆశించినదొకటి.. జరిగినది ఇంకొకటి. ఇదివరకూ `గృహం` అనే తమిళ్- తెలుగు ద్విభాషా చిత్రంతో విజయం అందుకున్నాడు. కానీ ఎందుకనో ఆ తర్వాత తిరిగి తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేయలేకపోయాడు.
అయినా మళ్లీ వస్తున్నా!! అంటూ తాజాగా సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించడం ఆసక్తి ని రేకెత్తిస్తోంది. ``ఎవడు ఏమన్నా నేను తిరిగి వస్తున్నాను లే. నా ప్రామిస్ ని గుర్తు పెట్టుకోండి ప్లీజ్. మిమ్మల్ని అలరించేందుకు బెస్ట్ గా ప్రయత్నిస్తాను. తెలుగు ప్రేక్షకులారా నాకు 18 నెలల సమయం ఇవ్వండి చాలు. మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వస్తున్నాను. ఎంతో శ్రమించి మంచి కంటెంట్ తయారు చేశాం`` అని తెలిపారు. నేను ఆన్ ది వే.. మాట్లాడుకుందాం!! అంటూ ఓ లవ్ ఈమోజీని సిద్ధూ షేర్ చేశారు. తాజా ప్రకటనతో సిద్ధార్థ్ మాంచి వేడి మీద ఉరుకుతున్నాడని అర్థమవుతోంది. మరి ఈ వేడిలో అయినా హిట్టు కొట్టి ట్రాక్ లోకొస్తాడంటారా? తెలుగులో కెరీర్ ఎలా ఉన్నా తమిళంలో మాత్రం సిద్ధార్థ్ కెరీర్ దూకుడు మీదనే ఉంది. అరువం.. చిచ్చోర్.. శివప్పు మంజల్ పచాయ్.. సైతాన్ కా బచ్చా అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. లీలా అనే హిందీ టీవీ సిరీస్ లోనూ సిద్ధార్థ్ నటిస్తున్నాడు.