Begin typing your search above and press return to search.
మళ్లీ కలవబోతున్న బ్రేకప్ లవర్స్
By: Tupaki Desk | 6 March 2019 3:30 AM GMTతమిళ హీరో శింబు మొదట నయనతారతో ప్రేమాయణం సాగించాడు, కొంత కాలంకు ఆమెతో బ్రేకప్ అయ్యాడు. ఆ తర్వాత కొంత కాలానికి హీరోయిన్ హన్సికను లైన్ లో పెట్టాడు. హన్సికతో ప్రేమను పెళ్లి వరకు తీసుకు వెళ్లాడు. అయితే పెళ్లి అనుకుంటున్న సమయంలో వీరి ప్రేమ బ్రేకప్ అయ్యింది. శింబు, హన్సికల బ్రేకప్ పెద్ద చర్చకు తెర లేపింది. అప్పటి నుండి కూడా ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్న శింబు, హన్సిక మళ్లీ ఇన్నాళ్లకు కలవబోతున్నారు. అయితే ఈ కలయిక ఒక సినిమా కోసం అంటూ తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
హన్సిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్లే అయినా అప్పుడే ఈమె జోష్ తో 50వ సినిమాకు చేరింది. తన ప్రతిష్టాత్మక 50వ సినిమా 'మహా' విషయంలో హన్సిక చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం పలు అంశాలతో వివాదాస్పదం అయ్యింది. దాంతో ఈ సినిమాపై తమిళ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రేక్షకులు కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు అదనపు ఆకర్షణ జోడించాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు జమీల్ ఈ చిత్రంలో శింబుతో ఒక పాత్ర చేయిస్తున్నాడు.
తన సినిమా క్రేజ్ పెరగాలని, ఆ పాత్రకు శింబు అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో హన్సిక కూడా ఆయన నటించేందుకు ఒప్పుకుంది. కొన్ని సీన్స్ తో పాటు ఒక పాటలో కూడా శింబు కనిపించబోతున్నాడు. ఇద్దరి కాంబోలో ఆ పాట, సీన్స్ ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. ఇద్దరు మరోసారి కలిసి నటిస్తే మళ్లీ మనసుల్లో ఏదైనా మార్పు వచ్చేనో చూడాలి. ప్రస్తుతం వీరిద్దరు కూడా సింగిల్ గానే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కనుక ఇద్దరు కలిస్తే తప్పేముందని కొందరు భావిస్తున్నారు.