Begin typing your search above and press return to search.
మానాడు పోయిందని.. మహా మానాడు!
By: Tupaki Desk | 15 Aug 2019 9:25 AM GMT'బాహుబలి' ఘన విజయం తర్వాత భారీ బడ్జెట్ సినిమాల హంగామా కొనసాగుతోంది. భారీ స్థాయిలో రెండు మూడు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించడం కామన్ గా మారింది. ఇక 100 కోట్ల బడ్జెట్ అనేది కూడా సాధారణ వ్యవహారం అయింది. రీసెంట్ గా తమిళ హీరో శింబు రూ.125 కోట్ల బడ్జెట్ తో ఒక భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడట.
అయితే ఈ సినిమా వెనక చాలా ట్విస్టులు ఉన్నాయి. మొదట వెంకట్ ప్రభు దర్శకత్వంలో సురేష్ కామాక్షి అనే నిర్మాత 'మానాడు' అనే సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ సినిమా ఆగిపోయిందని తర్వాత రూమర్లు కూడా వచ్చాయి. వీటికి స్పందిస్తూ నిర్మాత సురేష్ కామాక్షి 'మానాడు' షూటింగ్ జరుగుతోందని.. ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చాడు. అంతటితో ట్విస్టులు ఆగలేదు.. ఈమధ్య ఆయనే అనివార్య కారణాల వల్ల 'మానాడు' సినిమాను శింబుతో చేయడం లేదని వెల్లడిస్తూ వేరే హీరోతో ఈ సినిమా తెరకెక్కిస్తామని చెప్పారు.
దీంతో శింబు.. శింబు ఫాదర్ టీ. రాజేందర్ తీవ్రంగా అప్సెట్ అయినట్టున్నారు. రాజేందర్ వెంటనే "మానాడు లేకపోతే మహా మానాడు తో శింబు ప్రేక్షకుల ముందుకు వస్తాడని" ప్రకటించాడు. 'మహా మానాడు' చిత్రాన్ని సింబు సినీ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తామని.. ఈ సినిమాకు శింబు స్వయంగా దర్శకత్వం వహిస్తాడని ఆయన వెల్లడించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రకటనతో శింబు అభిమానులకు ఫుల్ జోష్ వచ్చింది. ఈ సినిమాను రూ. 125 కోట్లతో ఐదు భాషల్లో భారీ స్థాయిలో నిర్మిస్తారట.
అదేదో 100 కోట్ల సినిమా కాబట్టి సరిపోయింది. ఒకవేళ 1000 కోట్ల మహాభారతం నుంచి శింబు ను తప్పించి ఉంటే పంతానికి పోయి రూ.1116 కోట్లతో 'మహా మహాభారతం' నిర్మిస్తామని చెప్పి ఉండేవారేమో!