Begin typing your search above and press return to search.
మళ్లీ మాన భంగం చేయకండి సార్
By: Tupaki Desk | 12 Feb 2016 4:27 AM GMTహీరో శివాజీ ఉన్నాడు చూడండి.. ఈ మధ్యన సినిమాలు మానేసి.. రాజకీయాలూ ఉద్యమాలూ అంటూ తిరుగుతున్నాడు. ఇక మనోడికి రామ్ గోపాల్ వర్మ కుల రాజకీయాల మీద సినిమా తీస్తున్నాడని మండిపోయింది. ఒక టివి ఛానల్ లో నిర్వహించిన లైవ్ షోలో.. ఫోన్ చేసి మరీ రామూకి క్లాస్ పీకాడు. నేనెక్కడ క్లాస్ పీకుతున్నా సార్ అంటూ వర్మకు కోటింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి వర్మేనా పిచ్చోడు. రిటార్ట్ ఇచ్చాడులే.
''మీరు ఇప్పుడు వంగవీటి అంటూ సినిమా తీయడం వలన.. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం సమసిపోయి.. జనాలు మర్చిపోయిన.. ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ తలెత్తుతాయి. కుల రాజకీయాలను రెచ్చగొట్టడం ఎందుకు సార్??'' అంటూ ప్రశ్నించాడు శివాజి. దీనికి సమాధానం చెప్పిన వర్మ.. ''నేనేమన్నా 5వ క్లాస్ పిల్లోడినా.. నాకు మీరు క్లాస్ పీకుతున్నారు. నేను రంగా అండ్ నెహ్రూలలో ఎవరిని తప్పుగా చూపించినా.. వారి అనుచరుల నా మీద ఎటాక్ చేస్తారు కాని.. కమ్మ అండ్ కాపు కులాలు ఎందుకు కొట్టుకుంటాయి చెప్పండి??'' అంటూ పంచ్ వేశాడు వర్మ. దీనిపై స్పందించిన శివాజీ.. 5వ క్లాస్ పిల్లాడికి ఒక దెబ్బ వేసి బుద్ది చెబుతాం, అదే వర్మ లాంటి పెద్దలకు ఏం చెబుతాం అంటూ సెటైర్ వేస్తూనే.. ''ఇప్పటికే రాష్ట్రం మానభంగం అయిపోయిన స్థితిలో ఉంది.. ఇప్పుడు మీరు అగ్గి రాజేయకండి సార్'' అంటూ క్లోజ్ చేశాడు. శివాజీతో పాటు చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
వీళ్ళందరికీ వర్మ ఏం చెప్పాడంటే.. 'నేను రెండు ఫ్యామిలీల మధ్యన ఉన్న గొడవను.. ఆ ఎమోషన్ ను చూపించబోతున్నా.. అసలు ఇందులో కుల ప్రస్తావన ఎక్కడిది?' అంటూ ముగించాడు