Begin typing your search above and press return to search.
బన్నీపైనే ఆపరేషన్ గరుడ?
By: Tupaki Desk | 9 Feb 2020 6:10 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హార్డ్ వర్క్.. కఠోర తపస్సు గురించి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ప్రతి నిమిషం కఠోరంగా శ్రమించి ఇంతింతై అన్న చందంగా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఒక రకంగా మెగా లక్షణాల్ని బన్నీ పుష్కలంగా అందిపుచ్చుకున్నాడనడంలో సందేహమేం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఠఫ్ కాంపిటీటర్ ఉన్న కాంపౌండ్ లో ఎంతో ఛాలెంజింగ్ గా ఎదిగిన హీరో. అందుకే బన్ని అంటే అందరికీ ప్రత్యేకించి గౌరవం. తనకంటూ ఓ సెక్షన్ అభిమానులు ఉన్నారు.
సినిమా అంటే ప్రాణం పెట్టేస్తాడు. తనవంతుగా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి శ్రమిస్తాడు. బన్నీ పెట్టే ఎఫెర్ట్ గురించి ఆయనతో పనిచేసిన దర్శకులు చెబుతుంటే నిజంగా షాకింగ్ గానే అనిపిస్తుంది. ఇక డ్యాన్సుల పరంగా బన్నీ ఎంతగా శ్రమిస్తాడో చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లోనే బెస్ట్ డాన్సర్ అంటూ కితాబు అందుకున్నాడు. బన్నీ తో పనిచేసిన కొరియోగ్రాఫర్లే ఎన్నో వేదికలపై తన ప్రతిభ గురించి చెప్పారు. ఎన్టీఆర్ కి.. బన్నీకి వున్న వ్యత్యాసాన్ని కొరియోగ్రాఫర్స్ పలుమార్లు వివరించారు. తారక్ అల్ట్రా స్పీడ్ డ్యాన్సులు స్పెషల్ అనుకుంటే.. బన్ని డాన్సులు స్టైలిష్ గా.. ఎంతో క్యాచీగా ఉంటాయని ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఓ సందర్భంలో కొనియాడారు. నటన.. డాన్సుల్లో ట్యాలెంట్ ఉంది కాబట్టి స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. తాత అల్లు రామలింగయ్య నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకుని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ ఇప్పుడు టాప్ స్టార్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.
అయితే తాజాగా మాజీ నటుడు.. శివాజీ బన్నీని ఉద్దేశించి ఆసక్తిక వ్యాఖ్యలు చేసారు. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని..చిరంజీవి తర్వాత బన్ని అంటే ఎక్కువ అభిమానిస్తానని వ్యాఖ్యానించి శివాజీ.. ఇప్పటి హీరోల్లో బన్నీ ఒక్కరినే ఎక్కువగా అభిమానిస్తానని అన్నాడు. సౌత్ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత ఆస్థాయికి బన్నీ చేరుకుంటాడని అన్నారు. బన్నీ నటించిన సరైనోడు సినిమా ఎన్నిసార్లు చూసానో తనకే తెలియదని.. సినిమా కోసం బన్నీ పడే కష్టాన్ని వర్ణించలేనని శివాజీ పొగిడేశాడు. తానే గనుక అల్లు అరవింద్ కుమారుడై ఉంటే అంత కష్టపడేవాడిని కాదని...ఇంట్లో కూర్చొని తినేవాడినని నవ్వేసాడు.
కొన్నాళ్లుగా సినిమాలకు....సినిమా మనుషులకు దూరంగా ఉన్న శివాజీ ఉన్నట్లుండి ఇలా ఎందుకు ఊడిపడినట్లు? ఎన్నికల ముందు వరకూ ఒక మాట...ఎన్నికల సమీపించిన తర్వాత తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు పక్కన చేరి.. ఇప్పుడిలా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం వెనుక మర్మం ఏమిటో? అంటూ ఆయన వ్యతిరేక వర్గం కామెంట్లతో విరుచుకుపడుతోంది. శివాజీ మరో ఆపరేషన్ గరుడ ప్లాన్ చేశాడా? పచ్చపత్రికల రాతల్లో సాలిడ్ టెక్నిక్ ని అందిపుచ్చుకుని ఇలా మారాడా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకరిని పెంచుతూ మాట్లాడడం అంటే ఇతరులను తగ్గించే ప్రయత్నమే ఇది! అన్న అనుమానాల్ని మెగాభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
ఇక బన్నీ పోలికే మరీ విచిత్రం. కనీసం తన స్ఫూర్తి అని చెప్పుకునే చిరంజీవితో అయినా బన్నీని పోల్చలేదు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత బన్ని అంటూ ఆయనతోనే పోల్చేశాడు. అయితే శివాజీ లాజిక్ ఏమిటో కనిపెట్టలేనంత అసమర్థులు మెగాభిమానులు కానేకాదన్నది గ్రహించలేకపోయారు పాపం! పచ్చ చొక్కాలతో చెలిమి ఎంతకైనా దిగజార్చుతుంది అన్న కామెంట్లు సోషల్ మీడియాల్లో శివాజీపై వినిపిస్తున్నాయి.