Begin typing your search above and press return to search.
లక్ష్మి ఫ్యామిలీకి ఆర్థికం సహాయం చేస్తాం
By: Tupaki Desk | 28 April 2019 2:30 PM GMT`నువ్వు తోపురా` హీరో సుధాకర్ కోమాకుల కార్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై జరిగిన తప్పుడు ప్రచారాన్ని అతడు ఇదివరకూ ఖండించాడు. నేడు (ఆదివారం) హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ ప్రమాదంపై వివరణ ఇచ్చింది. ఈ ప్రమాదంపై అంతా తప్పుడు ప్రచారం జరిగిందని.. దీని వల్ల తమ సినిమా కి పెద్ద డ్యామేజ్ జరుగుతోందని .. రెండేళ్ల పాటు శ్రమను - కష్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆవేదన చెందారు దర్శకుడు హరినాథ్ బాబు. మే 3న ఈ సినిమా రిలీజవుతోంది. ప్రమోషన్స్ కోసం గుంటూరు వెళుతున్న టైమ్ లో ప్రమాదం జరిగింది. కారు మంగళగిరి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హీరో సహా యూనిట్ సభ్యులు గాయాలపాలయ్యారు. కారు ఢీకొని లక్ష్మి అనే ఓ కార్మికురాలు మృతిచెందారు. తనకు ఆర్థికంగా సాయం చేస్తామని ప్రకటించారు.
ఇక ఈ ప్రమాదంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయని.. అతడి పక్క సీట్ లో సుధాకర్ కూర్చుకున్నారని నిర్మాత జేమ్స్ తెలిపారు. సినిమా విడుదల అవుతుందన్న ఎక్సైట్ మెంట్ లో ఉన్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం షాక్‌కు గురిచేసిందని అన్నారు. సీటుబెల్ట్ మమ్మల్ని రక్షించిందని... మా తప్పిందం లేకపోయినా ఓ నిండు ప్రాణంపోవడం మమ్మల్ని కలిచివేసిందని దర్శకుడు హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా హీరో కారు నడుపుతున్నాడని వార్తలు రాశారు. ఇలాంటి వార్తలతోమా రెండేళ్ల కష్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయవద్దు అని అభ్యర్థించారు.
హీరో సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ - ``నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు ఇది. ఇంకా షాక్ లోనే ఉన్నాను. కారులో నేను ప్యాసింజర్ సీటులో కూర్చున్నాను. అనుకోకుండా మా కారు ట్రాక్టర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నా కళ్లు.. చేతులతో పాటు తలకు గాయాలయ్యాయి. ప్రమాదంలో షాక్ లో ఉన్న సమయంలో కారును నేనే డ్రైవ్ చేశారంటూ కొందరు వార్తలు రాశారు. ఇలా రాయడం సరికాదు. ఈవార్తలు చూసి అమెరికాలో ఉన్న నా భార్య బాధపడింది. ఇలాంటి వార్తాలతో మా కుటుంబాల్ని ఇబ్బంది పెట్టవద్దు.. అని అభ్యర్థించారు. హీరో తప్పు చేశాడన్న ప్రచారంతో తమ సినిమాకి ఇబ్బ ందికర పరిణామాలు ఏర్పడ్డాయని నిర్మాత వాపోవడం మీడియాలో చర్చకు వచ్చింది.