Begin typing your search above and press return to search.

రాజమౌళి చేతుల మీదుగా సూర్య టైటిల్

By:  Tupaki Desk   |   26 Jun 2019 8:17 AM GMT
రాజమౌళి చేతుల మీదుగా సూర్య టైటిల్
X
ఇటీవలే విడుదలైన ఎన్జికెతో షాక్ తిన్న సూర్య కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు. కెవి ఆనంద్ దర్సకత్వంలో రూపొందిన కాప్పన్ తెలుగు వెర్షన్ టైటిల్ ని రేపు ఉదయం 10.30కి రాజమౌళి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ తో పాటు రివీల్ చేయబోతున్నారు. చాలా రోజుల క్రితమే తమిళ్ వెర్షన్ టీజర్ వచ్చింది. కానీ తెలుగు డబ్బింగ్ హక్కులకు సంబంధించి ఇంకా లావాదేవీలు పూర్తి కానందున అప్పటి నుంచి ఇది పెండింగ్ లో ఉంది. రేపు క్లారిటీ రాబోతోంది.

సూర్య సెక్యూరిటీ ఆఫీసర్ గా మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా ఆర్య మరో కీలక పాత్రలో నటిస్తున్న కాప్పన్ దేశ భద్రతకు సంబందించిన థీమ్ తో రాబోతోంది. సుమారు వంద కోట్ల దాకా దీనికి బడ్జెట్ అయినట్టుగా చెబుతున్నారు. నిర్మిస్తున్న లైకా సంస్థ దీన్ని ధ్రువీకరించలేదు కానీ బిల్డప్ మాత్రం ఆ రేంజ్ లోనే ఉంది. కాప్పన్ ఆగస్ట్ నెలాఖరున విడుదల చేయబోతున్నారు. సూర్య దీంతో అయినా తెలుగులో మార్కెట్ బలపడుతుందని ఆశగా ఉన్నాడు.

ఎన్జికె మరీ దారుణంగా ఆడటంతో పాటు మార్కెట్ ని డ్యామేజ్ చేసింది. ఈ నేపథ్యంలో కాప్పన్ హిట్ కావడం చాలా అవసరం. టైటిల్ కి తెలుగులో అర్థం కాపలాదారు. అలాగే పెడితే బాగుండదు కాబట్టి ట్రెండ్ ప్రకారం ఏదైనా ఇంగ్లీష్ వర్డ్ తో పెట్టే ఛాన్స్ ఉంది. అది ఏదో రేపు తేలిపోతుంది. ఆర్య ఇటీవలే పెళ్లి చేసుకున్న సాయేషా ఇందులో హీరోయిన్ గా నటించింది. హరీస్ జైరాజ్ సంగీతం మరో ఆకర్షణగా నిలవనుంది