Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ లో షాకిచ్చే కోణం బాబోయ్!

By:  Tupaki Desk   |   29 May 2019 1:30 AM GMT
ఆ డైరెక్ట‌ర్ లో షాకిచ్చే కోణం బాబోయ్!
X
సూర్య న‌టించిన `యువ` పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ మూవీ. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు మ‌రోసారి అత‌డు ఎన్‌ జీకే పేరుతో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ లో న‌టిస్తుండ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్. `యువ‌`తో ఈ సినిమాకి ఏదైనా లింక్ ఉందా అంటే అలాంటిదేం లేద‌ని సూర్య ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. యువ‌లో రాజ‌కీయాల‌తో పాటు అన్ని విష‌యాలు ఉంటాయి. కానీ ఎన్‌.జి.కెలో ఇప్పటివరకూ చూసిన పొలిటికల్‌ సినిమాలకు విభిన్నమైన‌ది. ప్రేక్షకులు పొలిటికల్ అంశాల‌ను పూర్తిగా ఫీల్ అవుతారు. ఈ సినిమా ద్వారా శ్రీరాఘవ పొలిటికల్‌ సినిమాల్లో ఒక డిఫరెంట్‌ లేయర్‌ ను చూపిస్తున్నారు. ఎలాంటి రాజ‌కీయ నేప‌థ్యం లేని ఓ సాధారణ వ్యక్తి తనకు తెలియకుండానే అతన్ని పొలిటికల్‌ సిస్టమ్‌ లోకి కొన్ని శక్తులు లాగితే.. ఆ వ్యక్తి వల్ల సమాజానికి ఎలాంటి మంచి జరిగింది? అనేది కథాంశం. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఒక నిజాయితీ ఉన్న వ్య‌క్తి ఈ సమాజాన్ని ఎలా మార్చాడు? అన్న‌ది ఎగ్జ‌యిట్ చేస్తుంద‌ని సూర్య తెలిపారు. ఈ చిత్రం రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌న్నారు.

సెల్వ రాఘవన్ కోసం 2001 నుండి వేచి చూశాను. ఒక అభిమానిగా ఆయన సినిమాలో నటించడానికి నాకు 19 ఏళ్లు పట్టింది. ఈ కథ రాయడానికి సెల్వ రాఘవన్ కు ఏడాదిన్న‌ర పట్టింది. ఆయన ఒక్కరే కూర్చుని కథను రాసుకున్నారు. స్క్రీన్‌ప్లే కూడా చాలా ఎఫెక్టివ్‌ గా తీర్చిదిద్దారు. ప్రతి సీన్‌ ని ఆయన ఎలా విజువలైజ్‌ చేయాలనుకునేది ఆర్టిస్టుకు ముందే చెబుతారు. ఆయన మంచి నటుడు కాబట్టే యూనిక్ సినిమాలు చేశార‌ని సూర్య అన్నారు.

ఇటీవ‌ల సెల్వ ఫామ్ లో లేరు క‌దా? అన్న ప్ర‌శ్న‌కు.. ఒక్కో ద‌శ‌లో ఒక్కొక్క‌రి ఫేజ్ ఒక్కోలా మారుతుంది. ధోని కూడా ఒక సందర్భంలో ఇలాంటి స‌న్నివేశాన్ని ఎదుర్కొన్నారు. కొంత‌మంది యూనిక్. వేరొకరితో రీప్లేస్‌ చెయ్యలేం. సెల్వ లాంటి ప్ర‌తిభావంతుడైన మేకర్‌ ని వేరొక‌రిని చూడలేదు. ఇంతవరకూ ఏ దర్శకుడు కూడా ఆయనలాంటి సినిమా చేయలేదు. న‌ట‌న రాని వారి చేత న‌టింప‌జేసే స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు. ఓ డిఫరెంట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ని ఆడియన్స్‌ కి ఇవ్వడానికి శ్ర‌మిస్తారు.. అని అన్నారు. సెల్వ‌తో ప‌ని చేయ‌డం అంటే ఆశ్ర‌మానికి వెళ్లిన‌ట్టే. సెల్ ఫోన్లు ఉండ‌వు. ఎవ‌రితోనూ మాట్లాడ‌కూడ‌దు. ప్రతి ఒక్కరూ ఒక మెడిటేషన్‌ మోడ్‌లో ఉండాలి. ప్రతి సీన్‌ కోసం అదే ఎమోషన్‌ను మనం కూడా ఫీల్‌ అవ్వాల్సి ఉంటుంది అని అన్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో చెందిన సినిమా కాదు.. బ‌యోపిక్ కానే కాద‌ని సూర్య తెలిపారు. జ‌న‌ర‌ల్ పాలిటిక్స్ కి సంబంధించిన చిత్ర‌మిద‌ని అన్నారు.