Begin typing your search above and press return to search.

రీషూట్ అన్న హీరో.. స్పందించని నిర్మాత!

By:  Tupaki Desk   |   31 Oct 2019 7:07 AM GMT
రీషూట్ అన్న హీరో.. స్పందించని నిర్మాత!
X
అదో స్టార్ ప్రొడ్యూసర్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా. ఇద్దరు హీరోల మల్టిస్టారర్. మెయిన్ హీరో అందులో నెగెటివ్ టచ్ ఉండే పాత్రలో నటిస్తున్నారని టాక్ ఉంది. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయట.

ఈ సినిమా రషెస్ చూసిన హీరోగారికి కొన్ని సీన్స్ సంతృప్తికరంగా అనిపించలేదట. అసలే ఈమధ్య వరస పరాజయాలతో సతమతమవుతున్నాడు కాబట్టి ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని పట్టుదలగా ఉన్నాడట. అందుకే ఆ సీన్లు రీషూట్ చేయాల్సిందిగా దర్శకుడిని కోరాడట. హీరో.. దర్శకుడు రీషూట్ కోసం ప్లాన్ చేస్తే అది ఇష్టం లేని నిర్మాత రీ షూట్ కు డబ్బు ఇవ్వకుండా.. మాట దాటేస్తూ ఉన్నాడట. దీంతో సినిమా ఫిబ్రవరికి రిలీజ్ అయ్యే విషయంలో కొంత సందిగ్ధత నెలకొందట.

ఇదంతా ఒక ఎత్తైతే ఈ నిర్మాత ఈమధ్య తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో మరీ వెనకబడి ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా నెలలు గడుస్తున్నా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో టీమ్ అసంతృప్తిగా ఉన్నారట. ఒక స్టార్ ప్రొడ్యూసర్ సినిమాను నిర్మిస్తున్నారంటే ఆడియన్స్ కు ఆ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉందో రెగ్యులర్ గా వెల్లడిస్తూ ఉంటారు. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అప్డేట్ లేదు. మరి ఈ సినిమా విషయంలో నిర్మాత అలోచన ఏంటో తెలియాలంటే కొంతకాలం వేచి చూడకతప్పదు.