Begin typing your search above and press return to search.
రాజమౌళి రిలీజ్ చేసిన 'హీరో' ట్రైలర్..!
By: Tupaki Desk | 10 Jan 2022 11:17 AM GMTసూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ''హీరో''. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 'పక్కా పండుగ సినిమా' అంటూ సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్.. ఇప్పటికే ప్రచార చిత్రాలు - ఫస్ట్ సింగిల్ - టీజర్ లతో సోషల్ మీడియాలో సందడి చేసారు. ఈ క్రమంలో తాజాగా దర్శకధీరుడు రాజమౌళి సినిమా ట్రైలర్ ను ఆవిష్కరించి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసారు.
'కలల్లో బిర్యానీ వండుకుంటే రియాలిటీలో కడుపు నిండదురా.. రియాలిటీలోకి రా..' అని నరేశ్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సినిమా హీరో కావాలని కలలు కనే నేటి తరం కుర్రాడి పాత్రలో అశోక్ కనిపిస్తున్నాడు. దీనికి అతని తల్లి సైడ్ నుంచి సపోర్ట్ లభిస్తుండగా.. తండ్రి (నరేష్) మరియు ప్రేయసి ఫాదర్ (జగపతి బాబు) మాత్రం ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
'హీరో' సినిమాలో అశోక్ డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. అందులో కౌబాయ్ మరియు జోకర్ గెటప్స్ రెండూ ప్రత్యేకంగా నిలుస్తాయని తెలుస్తోంది. ట్రైలర్ లో అశోక్ ఎనర్జిటిక్ గా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో పాటుగా కామెడీ మరియు హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ ను ట్రైలర్ లో చూపించారు. ఇందులో వెన్నెల కిశోర్ - బ్రహ్మాజీ - కోట శ్రీనివాస్ - సత్య - అర్చన సౌందర్య - కౌశల్య - మైమ్ గోపి - అజయ్ ప్రభాకర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. 'క్రియేటివ్ పీపుల్ ఎప్పుడు పడితే అప్పుడు కథలు చెప్పరు' అని అశోక్ చెప్పడంతో ట్రైలర్ ముగిసింది.
అశోక్ గల్లా డెబ్యూ మూవీ కోసం లవ్ - యాక్షన్ - కామెడీ - రొమాన్స్..అన్ని అంశాలను కలబోసిన స్క్రిప్ట్ తో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ''హీరో'' చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. రెగ్యులర్ కమర్షియల్ మూవీ మేకింగ్ కి పూర్తి భిన్నంగా తనదైన శైలిలో టేకింగ్ ఉంటుందని యంగ్ డైరెక్టర్ మరోసారి నిరూపించాడు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సమీర్ రెడ్డి - రిచర్డ్ ప్రసాద్ ల సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రవీణ్ పూడి దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు.
వారసుడి లాంచింగ్ కోసం ఏపీ గల్లా జయదేవ్ ఖర్చుకు వెనకాడకుండా హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ''హీరో'' సినిమాని రూపొందించారని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. కృష్ణ మరియు గల్లా అరుణకుమారి సమర్పణలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. చంద్రశేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. మరి సంక్రాంతి బరిలో 'బంగార్రాజు' వంటి క్రేజీ మూవీకి పోటీగా దిగుతున్న హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.