Begin typing your search above and press return to search.

యంగ్ హీరోయిన్ ల‌ను టెంప్ట్ చేస్తున్న హీరో

By:  Tupaki Desk   |   15 Dec 2019 5:30 PM GMT
యంగ్ హీరోయిన్ ల‌ను టెంప్ట్ చేస్తున్న హీరో
X
టెంప్ట్ చేయ‌డం అన్న‌ది ఒక ర‌కంగా అరుదైన క‌ళ‌. టైమ్ చూసి టైమింగుతో కొట్ట‌డం అన్న‌ది కొంద‌రికే తెలిసిన విద్య‌. ఇలాంటి క‌నిక‌ట్టు విద్య‌లో ఆ యంగ్ హీరో ఆరితేరిపోయాడ‌ట‌. ఎవ‌రైనా అందాల భామ బ‌ర్త్ డే వ‌స్తే చాలు.. వెంట‌నే టెంప్టింగ్ చేస్తూ తొలి మెసేజ్ త‌న‌నుంచే వెళుతోంద‌ట‌. మిడ్ నైట్ 12 అవ్వ‌గానే షార్ప్ గా అత‌డి నుంచి సోష‌ల్ మీడియాల్లోనూ మెసేజ్ వెళుతుంద‌ట‌. ఆ యంగ్ హీరో ఆర్ట్ గురించి తెలిసిన వారంతా ఔరౌరా! అంటూ స‌ర్ ప్రైజ్ అయిపోతున్నారు. ఇంత‌కీ ఎవ‌రా హీరో అన్న‌ది అటుంచితే..

టెంప్ట్ చేయ‌డంలో .. స్నేహం చేయ‌డంలో అత‌డు మ‌హా ఘ‌నాపాటి. తన స‌ర‌స‌న న‌టించిన ప్ర‌తి హీరోయిన్ తో ఎంతో ఇదిగా స్నేహం చేస్తాడు. ఆ ర్యాపోని ఎప్ప‌టికీ కొన‌సాగిస్తాడు. పైగా ఆ హీరోయిన్ల‌తోనే త‌న సినిమాల‌కు ప్ర‌చారం చేయించుకునే ఘ‌నాపాటి. స‌ద‌రు యంగ్ హీరో గ‌త కొంత కాలంగా హిట్టు అన్న‌దానికే దూర‌మైనా.. ఇంకా మైలేజ్ ద‌క్కుతోందంటే త‌న‌లో ఉన్న ఆ క్వాలిటీ వ‌ల్ల‌నే. ఇటు నాయిక‌ల్నే కాదు.. అటు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని అంతే ఇదిగా కాకా ప‌ట్టేస్తాడ‌ట‌. ఇటీవ‌ల ఓ థ్రిల్ల‌ర్ సినిమాతో ఆక‌ట్టుకుని.. మ‌ళ్లీ స్పీడు పెంచిన యంగ్ బ్యాచిల‌ర్ హీరో ఇప్ప‌టికి త‌న పాత స్నేహాల్ని.. అందాల భామ‌ల్ని మ‌ర్చిపోలేక‌పోతున్నాడ‌ట‌.

త‌న‌తో క‌లిసి న‌టించిన హీరోయిన్‌తో ఫ్రెండ్షిప్ చేసుకోవ‌డం.... దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వారికి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇవ్వ‌డం..ఇది గ‌త కొంత కాలంగా జ‌రుగుతూనే వుంది. ఈ యంగ్ హీరోతో ఫ్రెండ్స్ అయిన హీరోయిన్స్ అర‌డ‌జ‌ను పైగానే వున్నారు. వారి పుట్టిన రోజుల‌కు సాధార‌ణంగా విషెస్ చెబుతూ స‌ర్ ప్రైజ్ చేస్తున్న యంగ్ హీరో తాజాగా ఓ హీరోయిన్ కి ఊహించ‌ని బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు. సోషల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక యంగ్ హీరోయిన్ పెయింటింగ్ పిక్ ని స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ గా పంపాడు. దీంతో ఈ యంగ్ హీరో త‌న‌కు ఎంతో క్లోజ్ అయిన ఓ అందాల హీరోయిన్ ని పెళ్లాడ‌తాడంటూ ఫిలింస‌ర్కిల్స్ లో ఠాంఠాం మోగుతోంది.