Begin typing your search above and press return to search.
ఈసారి ఆ రంగాన్ని టార్గెట్ చేసిన విజయ్
By: Tupaki Desk | 10 Dec 2018 2:30 PM GMTతమిళ స్టార్ హీరో విజయ్ ఈమద్య కాలంలో చేస్తున్న సినిమాలన్ని కూడా సామాజిక స్పృహ ఉన్న సినిమాలే. ప్రతి సినిమాలో ఒక సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఏదో అంశాన్ని లేవనెత్తుతున్నాడు. విజయ్ మరియు అట్లీలతో ఈయన చేస్తున్న సినిమాలు సంచలనాలకు మారు పేరుగా నిలుస్తున్నాయి. మెర్షల్- సర్కార్ అంతకు ముందు వచ్చిన కత్తి మరియు తుపాకి చిత్రాలు భారీ ఎత్తున విజయాలను దక్కించుకోవడంతో పాటు ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించాయి. ప్రస్తుతం విజయ్ మరోసారి అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు.
విజయ్- అట్లీల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం క్రీడా నేపథ్యం అంటూ ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం కథ గురించి తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 125 కోట్ల మంది ఉన్న మన ఇండియాకు ఒలింపిక్స్ లో ఎక్కువ మెడల్స్ రాకపోవడంకు కారణం రాజకీయాలు అంటూ ఈ చిత్రం కథలో భాగంగా చూపించబోతున్నారట. ఇండియాలో ఆటల్లో ఉన్న రాజకీయం గురించి ఈ చిత్రంలో కథ ఉంటుందని సమాచారం అందుతోంది.
ఎంతో మంది క్రీడాకారులు ప్రోత్సాహం లేక వెనుకబడి పోతున్నారు. కొందరు ఏదోలా పైకి వచ్చేలా చూస్తుంటే రాజకీయం వల్ల వారు వృద్దిలోకి రావడంలో విఫలం అవుతున్నారు. ఆ కాన్సెప్ట్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేసి విజయ్ తో అట్లీ కుమార్ చిత్రాన్ని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట. ఈ చిత్రం మరెన్ని సంచలనాలకు, వివాదాలకు తెర లేపుతుందో చూడాలి.