Begin typing your search above and press return to search.
'వర్మ' నష్టంలో విక్రమ్ కు వాటా?
By: Tupaki Desk | 9 Feb 2019 1:59 PM GMTటాలీవుడ్ సెన్సేషన్ 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ 'వర్మ' షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఔట్ పుట్ సరిగా రాలేదు అంటూ నిర్మాణ సంస్థ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే తీసిన మొత్తం ఫుటేజ్ ను తొలగించి, మళ్లీ మొత్తం రీ షూట్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. E4 ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ రీమేక్ ను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. సినిమా మొత్తంను రీ షూట్ చేయాలంటే బడ్జెట్ డబుల్ అవుతుంది.
'వర్మ' చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న దృవ్ తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు అయిన విషయం తెల్సిందే. విక్రమ్ తన ప్రతి సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈ చిత్రం విషయంలో కూడా అదే విధంగా భావించి సినిమా మొత్తంను రీ షూట్ చేసేందుకు నిర్మాతలను ఒప్పించినట్లుగా తెలుస్తోంది. కొడుకు భవిష్యత్తు కోసం విక్రమ్ నిర్మాతల నష్టాల్లో భాగస్వామ్యం తీసుకుంటానంటూ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు వర్మ సినిమా తర్వాత వచ్చే ఏడాది చివర్లో తాను కూడా E4 ఎంటర్ టైన్ మెంట్ సంస్థలో ఒక చిత్రాన్ని చేస్తానని హామీ ఇచ్చాడట.
సినిమా ఎలా వచ్చినా కూడా విడుదల చేస్తే స్టార్ హీరో విక్రమ్ తనయుడు కనుక మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. అన్ని విధాలుగా మంచి బిజినెస్ అయ్యేది. కాని నిర్మాతలు మాత్రం విక్రమ్ కోసం రీ షూట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాల నడుమ ధృవ్ ను పరిచయం చేయబోతున్న విక్రమ్ తన కొడుకుకు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఇవ్వాలని ఆయన తాపత్రయ పడుతున్నాడు. మొత్తానికి వర్మ రీ షూట్ తో కోట్ల రూపాయలు వృధా అయ్యాయి.