Begin typing your search above and press return to search.
విశాల్ విశ్వరూపమే 'చక్ర
By: Tupaki Desk | 12 Jan 2021 3:30 PM GMTతమిళ స్టార్ హీరోల్లో అజిత్ .. విజయ్ .. సూర్య .. తరువాత స్థానంలో విశాల్ కనిపిస్తాడు. విశాల్ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించే అంశాలు .. యూత్ కోరుకునే అంశాలు ఉన్నప్పటికీ, మాస్ ఆడియన్స్ ఇష్టపడే యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే విశాల్ ను యాక్షన్ హీరోగానే చూస్తారు. ఆయన సినిమాలను ఆ కేటగిరీలోనే వేస్తారు. గత మూడేళ్లుగా ఆయన ఏడాదికి ఒక హిట్టును తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాడు. ఆయన నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో యాక్షన్ మూవీ రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే 'చక్ర'.
ఎమ్మెస్ ఆనందన్ దర్శకుడిగా 'చక్ర' సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో విశాల్ సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. 'సైబర్ క్రైమ్' నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కథాప్రకారం .. విశాల్ పాత్ర ప్రకారం ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయట. చాలా స్టైలీష్ గా సాగే ఈ యాక్షన్ సీన్స్ కోసం విశాల్ భారీ మొత్తంలో ఖర్చు చేశాడని చెబుతున్నారు. ఇంతవరకూ తన సినిమాల్లో చూడని ఫైట్స్ ను ఆయన ఈ సినిమా కోసం డిజైన్ చేయించుకున్నాడని అంటున్నారు. ఆశ్చర్యచకితులను చేసేలా ఆ ఫైట్స్ రావడం కోసమే ఆయన అంతమొత్తం ఖర్చుకు వెనుకాడలేదని చెప్పుకుంటున్నారు.
విశాల్ సరసన కథానాయికలుగా రెజీనా .. శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. ఈ ఇద్దరు హీరోయిన్లకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అందువలన తెలుగులోను మంచి వసూళ్లను రాబట్టవచ్చనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను భారీస్థాయిలో విడుదల కానుంది. సైబర్ నేరగాళ్ల కదలికలు ఎలా ఉంటాయి? కంటికి కనిపించని వాళ్ల సామ్రాజ్యం ఎవరి కనుసన్నలలో నడుస్తూ ఉంటుంది? వాళ్ల మూలలను వెదికి పట్టుకోవడం కోసం హీరో ఏం చేస్తాడనే కథాకథనాలతో సాగనున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది. ఈ సినిమాతో విశాల్ ఈ ఏడాదిలో తొలి హిట్ కొట్టేస్తాడేమో చూడాలి.