Begin typing your search above and press return to search.

సోదాలు జ‌రిగిన మాట నిజ‌మే: విశాల్

By:  Tupaki Desk   |   24 Oct 2017 2:41 PM GMT
సోదాలు జ‌రిగిన మాట నిజ‌మే: విశాల్
X
మెర్సల్ సినిమా పైర‌సీ వెర్షన్ చూసిన‌ బీజేపీ త‌మిళ‌నాడు అధ్య‌క్షుడు హెచ్ రాజా పై హీరో విశాల్ మండిప‌డ్డ సంగ‌తి తెలిసిందే. దీంతో, విశాల్ ఆఫీసులో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వ‌హించ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. తాము ఆ సోదాలు నిర్వ‌హించ‌లేద‌ని జీఎస్టీ అధికారులు బుకాయించారు. ఈ నేప‌థ్యంలో త‌న ఆఫీసులో సోదాల‌పై విశాల్ స్పందించారు. చెన్నైలోని తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ కార్యాల‌యంపై అధికారులు దాడులు చేయడం నిజ‌మేన‌ని స్పష్టం చేశాడు. ఈ స‌మ‌యంలో త‌న ఆఫీసులో సోదాలు జ‌ర‌గ‌డం కక్ష సాధింపు చ‌ర్య అని అభిప్రాయ‌ప‌డ్డారు. తాను బీజేపీ నేత‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన వెంట‌నే ఈ సోదాలు జ‌ర‌గ‌డంతో వాటిని అనుమానించాల్సి వస్తోందన్నారు. సాధార‌ణ సోదాల్లో భాగంగా ఇది జ‌ర‌గ‌లేద‌ని స్పష్టం చేశారు.

మెర్సల్ మూవీని తాను ఆన్ లైన్ లో చూశానని చెప్పిన‌ రాజా పై విశాల్ మ‌రోసారి మండిప‌డ్డారు. పైర‌సీ సినిమా చూడ‌డం నేర‌మ‌ని, పైర‌సీ సినిమా చూశాన‌ని చెప్పిన రాజాపై ఇంత‌వ‌ర‌కు చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేదో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని విశాల్ అన్నారు. దీనిని బ‌ట్టి బీజేపీ ప్ర‌భుత్వం పైరసీని ప్రోత్సహిస్తున్నట్టే న‌న్నారు. ప్ర‌భుత్వం పైర‌సీని నియంత్రిస్తే తాము మ‌రింత న‌గ‌దును ట్యాక్స్ రూపంలో చెల్లించే అవ‌కాశం క‌లుగుతుంద‌ని విశాల్ చెప్పారు. హీరో విజయ్ క్రిష్టియ‌న్ గా మ‌తం మార్చుకున్నాడ‌ని, అందుకే మోదీకి వ్య‌తిరేకంగా ఆ డైలాగులు చెప్పాడ‌ని రాజా చేసిన వ్యాఖ్య‌లను విశాల్ తీవ్రంగా ఖండించారు. అందుకే ఆయ‌న మోదీకి, బీజేపీకి వ్య‌తిరేకంగా ఆ డైలాగులు చెప్పార‌ని ఆరోపించారు.

సోమవారం సాయంత్రం జీఎస్టీ అధికారులు హఠాత్తుగా విశాల్ ఇల్లు - ఆఫీసుపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. వీఎఫ్ ఎఫ్ సంస్థ‌....50 లక్షల వ‌ర‌కు పన్ను ఎగవేసిందన్న ఆరోపణలపై అధికారులు విశాల్ ఆఫీసులో సుమారు మూడు గంటలపాటు దాడులు - సోదాలు నిర్వహించారు.