Begin typing your search above and press return to search.
తమిళ్ రాకర్స్ అంతు చూడాలన్న పందెం కోడి
By: Tupaki Desk | 6 Feb 2019 6:07 AM GMTఆన్ లైన్ లో రెగ్యులర్ గా కొత్త సినిమాలు డౌన్ లోడ్ చేసుకుని చూసే వాళ్ళకు తమిళ్ రాకర్స్ పేరు సుపరిచితం. లేటెస్ట్ మూవీ ఏది విడుదలైనా బాషా భేదం లేకుండా సాయంత్రం లోపే అప్ లోడ్ చేసి పెట్టడం వీళ్ళ ప్రత్యేకత. ఒకవేళ ఎవరైనా రెచ్చగొడితే విడుదలకు ముందు వదిలేందుకు సైతం వెనుకాడదు ఈ టీం. ఆ మధ్య విజయ్ దేవరకొండ టాక్సీవాలా ఎడిట్ కాని వెర్షన్ ను సారీ చెప్పి మరీ వారం ముందే పెట్టేసింది. అయితే దీని వల్ల ఎక్కువగా నష్టపోతోంది తమిళ పరిశ్రమ. మరీ దారుణంగా కొత్త పాత తేడా లేకుండా అన్ని ఉచిత సరుకులాగా తమిళ సినిమాలను తమ సైట్ లో పెట్టేస్తారు ఈ లీకు వీరులు.
తాజాగా వీళ్ళ గురించి మరోసారి స్పందించాడు విశాల్. తమిళనాడు ప్రభుత్వం తలుచుకుంటే తమిళ రాకర్స్ అంతు చూడగలరని తాను దైవంగా భావించే ప్రభుత్వం ఏదో ఒక రోజు ఇది చేసి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేసాడు. అయితే విశాల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు కాని సర్కార్ ఎంతమేరకు స్పందిస్తుంది అన్నది అనుమానమే. ఇళయరాజా ఈవెంట్ విజయవంతం కావడం పట్ల థాంక్స్ చెప్పేందుకు సిఎం పళనిస్వామిని కలిసిన విశాల్ ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు చేసాడు. తమిళ్ రాకర్స్ శృతి మించి పోతున్నారని అందరూ బాధితులుగా ఉన్నామని ఈ వ్యవస్థ నిర్వీర్యం కావాలి అంటే ఒక్క గవర్నమెంట్ వల్లే సాధ్యమని తేల్చి చెప్పాడు.
విశాల్ చాలా సార్లు తనవే కాదు కొత్త సినిమాలు ఏవి విడుదలైనా పైరసీని అణిచేందుకు చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. డివిడిల ట్రెండ్ వెళ్ళిపోయి ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్స్ లో సినిమాలు చూసే ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పైరసీ భూతాన్ని పట్టుకోవడం ఇంకా కష్టమైంది. ఇప్పుడు ఈ విశాల్ కామెంట్స్ పట్ల అజ్ఞాతంలో ఆపరేట్ చేసె తమిళ్ రాకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. వీళ్ళను ఆధారంగా చేసుకునే దర్శకుడు వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను సినిమాలో హైపర్ ఆది ట్రాక్ డిజైన్ చేసాడు. అది బాగా కనెక్ట్ అయ్యింది కూడా