Begin typing your search above and press return to search.

విశాఖలో హీరో విశాల్.. ఏం చేశాడో తెలుసా?

By:  Tupaki Desk   |   12 Jun 2018 8:45 AM GMT
విశాఖలో హీరో విశాల్.. ఏం చేశాడో తెలుసా?
X
హీరోగానే కాదు.. మంచి మానవత వాదిగా హీరో విశాల్ కు పేరుంది. తన సినిమాల్లోనే హీరో కాదు.. బయట కూడా హీరో అని చాలాసార్లు నిరూపించాడు. చెన్నై వరదల సమయంలో స్వయంగా ఈత కొట్టుకుంటూ వెళ్లి మరి అన్నార్థులను రక్షించి వారికి అహారం, నీళ్లు వసతి కల్పించాడు విశాల్.. ఆ తర్వాత తమిళ సినీ సంఘం నడిగర్ లో పాతుకుపోయిన పెద్దలపై పోటీచేసి గెలిచి తమిళనాట సంచలనం సృష్టించాడు. తెలుగువాడైన విశాల్ తమిళనాట ఇలా సంచలనాలు సృష్టిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు..

తాజాగా విశాల్ నటించిన అభిమన్యుడు మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో భాగంగానే విశాల్ విశాఖపట్నం వచ్చాడు. విశాల్ తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చి తాజాగా విశాఖలోని ఎస్.ఈ.జడ్ లో ఉన్న బ్రాండిక్స్ కంపెనీకి వెళ్లాడు. ఆసియా ఖండంలోనే అత్యధికంగా మహిళలు పనిచేసే ఈ కంపెనీలో విశాల్ సందడి చేశాడు. విశాఖ జిల్లాలోని 18వేల మంది అన్ స్కిల్డ్ మహిళా కార్మికులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. విశాల్ ఆ కంపెనీకి వెళ్లి చాలా సేపు వారితో గడిపారు. మహిళల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి సంస్థ నిర్మించిన టాయ్ లెట్ కాంప్లెక్స్ ను ప్రారంభించాడు. మళ్లీ వస్తానని మాట కూడా ఇచ్చాడు.

విశాల్ కంపెనీకి వచ్చాడని తెలిసి వేల సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. అందరిని పలకరించిన విశాల్ తన సినిమా ప్రమోషన్ తోపాటు మహిళల సమస్యలను సావధానంగా విని తను అందరిలాంటి హీరోను కాదని నిరూపించాడు. విశాల్ లోని ఈ గుణమే అతడిని అందరి మదిలో ఉండేలా చేస్తోంది.