Begin typing your search above and press return to search.

బద్ధ శత్రువుల ఫైవ్ స్టార్ కలయిక

By:  Tupaki Desk   |   21 May 2019 3:02 PM IST
బద్ధ శత్రువుల ఫైవ్ స్టార్ కలయిక
X
సినిమాల్లోనైనా రాజకీయాల్లోనైనా శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్నది నిజం. దానికి సాక్ష్యంగా ఎన్నో ఉదాహరణలు నిత్యం కళ్లారా చూస్తూనే ఉంటాం. దానికి ఎవరూ మినహాయింపు కాదు. కోలీవుడ్ లో నడిగర్ సంఘం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవలే కోర్టులో షాకులు తిన్న విశాల్ కొత్త ఎత్తుగడలతో పావులు కదుపుతున్నాడు. బద్ధ వైరం కలిగిన ప్రత్యర్ధులుగా భావించే శరత్ కుమార్-రాధికలతో విశాల్ ఇటీవలే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నట్టు తెలిసింది.

నడిగర్ సంఘంకు చెందిన వేదమంగళంలోకి భూముల అమ్మకాలకు సంబంధించి ఆరోపణలు ఎదురుకుంటున్న శరత్ కుమార్ రాధారవిలు సభ్యత్వం కోల్పోయారు. మరోవైపు విశాల్ కు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడేందుకు ప్రత్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు. వీటిని ధీటుగా ఎదురుకోవాలి అంటే పరిశ్రమలో ఉన్న శత్రువుల సంఖ్యను తగ్గించాలని డిసైడ్ అయిన విశాల్ ఈ నేపథ్యంలో రాధికా దంపతులతో మీటింగ్ పెట్టుకోవడం చెన్నైలో హాట్ టాపిక్ గా మారింది. సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నాడంటూ ప్రచారం మొదలయ్యింది.

ఏం జరిగిందనే వివరాలు బయటికి రాలేదు కానీ కీలకమైన అంశాల గురించి చర్చలు జరిగాయన్నది స్పష్టం. ఈసారి ఎన్నడూ లేని రీతిలో తమిళనాట సినిమా ఎన్నికలు ఉండబోతున్నాయి. ఏదో దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్న రేంజ్ లో హడావిడి జరగనుంది. రానున్న రోజుల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వ్యతిరేక గాలి బలంగా వీస్తున్న తరుణంలో విశాల్ దాన్ని ఎలా ఎదురుకుంటాడో చూడాలి