Begin typing your search above and press return to search.
ఇక నుంచి హీరో షూటింగ్ లో అంబులెన్స్ ఉండాలేమో!
By: Tupaki Desk | 11 Aug 2022 9:27 AM GMTసినిమా షూటింగ్లో నటీనటులు యాక్షన్ సన్నివేశాల్లో తరచుగా గాయాలపాలవడం సాధారణ విషయమే. అయితే ఆ గాయాలు తీవ్రత పెరిగితే మాత్రం షూటింగ్ పై చాలా ప్రభావం పడుతుంది. ఒక సినిమా షూటింగ్ ఒక రోజు కాల్షీట్ సెట్ చేయాలి అంటే చాలా కష్టమైన పని. ఒక్కరి కారణంగా షూటింగ్ ఆగిపోయిన కూడా మళ్లీ ఆ ప్రణాళిక కోసం సమయం అలాగే డబ్బు కూడా వృధా అవుతుంది.
ఈ క్రమంలో హీరోలు అలాగే ఇతర నటినట్లు కూడా సినిమా షూటింగ్లలో చాలా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే దర్శక నిర్మాతలు కూడా వారి క్షేమం కోసం ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కొంచెం కూడా షూటింగ్ ఆలస్యం కావద్దని అనుకుంటారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఒక హీరో తరచుగా గాయాల పాలవుతుండడం హాట్ టాపిక్ గా మారింది.
ఇకనుంచి అతని సినిమా షూటింగ్ జరుగుతోంది అంటే పక్కనే అంబులెన్స్ తో పాటు ఒక డాక్టర్ని కూడా పెడితే బెటర్ ఏమో అని మరి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
తరచుగా గాయాల పాలవుతున్న ఆ హీరో మరెవరో కాదు తమిళనాడు విశాల్ విశాల్. అతను లాఠీ సినిమా షూటింగ్లో అయితే ఇఇప్పటికే మూడుసార్లు ప్రమాదానికి గురైయ్యాడు. ఒకసారి తీవ్రంగా దెబ్బలు కూడా తగలడంతో కొన్ని రోజులపాటు షూటింగ్ షూటింగ్ కూడా ఆలస్యమైంది.
అయితే ఇటీవల మార్క్ ఆంటోనీ షూటింగ్ ప్రారంభించిన విశాల్ ఈరోజు తెల్లవారుజామున చెన్నైలో యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ సినిమా సెట్స్‌లో విశాల్‌కి తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. మార్క్ ఆంటోని యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ గా రానున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాల్ ఎనిమీ చిత్రాన్ని నిర్మించిన ఎస్ వినోద్ కుమార్ ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.