Begin typing your search above and press return to search.
నేను సింగల్.. రాసుంటే పెళ్లి అదే అవుతుంది: హీరో విశాల్
By: Tupaki Desk | 26 Feb 2021 3:30 AM GMTకరోనా సమయంలో సినీతారల పెళ్లిళ్లు చాలానే జరిగాయి. ఎవరికి వారు పెళ్లిళ్ల వార్తలను సోషల్ మీడియాలో తెలియజేస్తూ సర్ప్రైజ్ చేస్తూ వచ్చారు. హీరోలే కాదు హీరోయిన్స్ కూడా మెల్లగా ముహుర్తాలు పెట్టేసుకొని పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా చాలామంది పెళ్లిపీటలు ఎక్కడం జరిగింది. అయితే కొందరు హీరోలు పెళ్లి గురించి స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సెలబ్రిటీల నిర్ణయం గురించి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. తాజాగా స్టార్ యాక్టర్ విశాల్ పెళ్లి వార్త మళ్లీ తెరమీదకి వచ్చింది. విశాల్ పెళ్లి ఫలానా అమ్మాయితో అంటూ ఊహగానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో విశాల్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. మొదటగా వరలక్ష్మి శరత్ కుమార్ తో పెళ్లి అని పుకార్లు వచ్చాయి కానీ అందులో నిజంలేదని తేలింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు ఫేమ్ అనిషా రెడ్డితో పెళ్ళని చెప్పి 2019లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు విశాల్.
అంతేగాక త్వరలోనే అనిషాను పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పాడు. కానీ ఎంగేజ్మెంట్ జరిగిన కొంతకాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అది కూడా ఆగిపోయింది. ఆ తర్వాత అనిషా విశాల్ కు సంబంధించిన ఫోటోస్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో డిలీట్ చేసింది. ఇక తాజాగా మరో అమ్మాయితో విశాల్ పెళ్లి అనే పుకార్లపై విశాల్ క్లారిటీ ఇచ్చేసాడు. విశాల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను సింగిల్ అని, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పాడు.
పెళ్లి తన జీవితంలో రాసి ఉంటే తప్పక జరుగుతుందని.. సమయం వచ్చినప్పుడు నేను కూడా తల వంచాల్సిందే అని అన్నాడు విశాల్. ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తున్నాను. అస్సలు ఊహించలేదు. నా తర్వాత ఇంటర్వ్యూలో తప్పక శుభవార్త చెప్తానని సర్ప్రైజ్ చేసాడు విశాల్. ఇదిలా ఉండగా ఇటీవలే విశాల్ చక్ర అనే సినిమా రిలీజ్ చేసాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. చూడాలి మరి విశాల్ ఎలాంటి శుభవార్త చెబుతాడో!